IPL : కేజీఎఫ్-2 ఎఫెక్ట్.. భారీగా ప‌డిపోయిన ఐపీఎల్ వ్యూయ‌ర్‌షిప్

-

రాకింగ్ స్టార్ య‌ష్.. కేజీఎఫ్ సునామీ కొన‌సాగుతుంది. కేజీఎఫ్ దెబ్బ‌కు తెలుగు, హిందీతో పాటు ఇత‌ర ఇండ‌స్ట్రీల్లో సినిమాలు మూసుకోవాల్సి వ‌చ్చింది. కేజీఎఫ్ దెబ్బ సినిమాల‌తో పాటు ఐపీఎల్ పై కూడా గట్టిగానే ప‌డింది. ఐపీఎల్ వ్యూయ‌ర్‌షిప్ భారీగా ప‌డిపోయింది. ఇప్ప‌టికే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ తార‌క్ మ‌ల్టీ స్టార‌ర్ గా వ‌చ్చిన‌ ఆర్ఆర్ఆర్ ప్ర‌భావంతో ఐపీఎల్ వ్యూయ‌ర్‌షిప్ దాదాపు 30 శాతం ప‌డిపోయింది. ఇప్పుడు రాకీ భాయ్ దెబ్బ‌కు ఐపీఎల్ వ్యూయ‌ర్‌షిప్ స‌గానికి స‌గం ప‌డిపోయింది.

2021 లో ఒక్కో సీజ‌న్ లో వ్యూయ‌ర్‌షిప్ భారీ గా న‌మోదు కాగ‌.. ప్ర‌స్తుతం ఊహించ‌ని షాక్ త‌గులుతుంది. గ‌త ఏడాది డిస్పీ ప్ల‌స్ హాట్ స్టార్ లో 2 నుంచి 5 మిలియ‌న్ల వ్యూస్ రాగ.. ఇప్పుడు కేవ‌లం 50 ల‌క్షల లోపే వ్యూస్ న‌మోదు అవుతున్నాయి. దీంతో ప్ర‌సార హ‌క్కుల‌ను భారీ ధ‌రకు కొనుగోలు చేసిన డిస్పీ హాట్ స్టార్ యాజ‌మానులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌.

ప్ర‌జ‌ల్లో కేజీఎఫ్ జోష్ త‌గ్గిన త‌ర్వాతే.. ఐపీఎల్ కు మునుప‌టి వైభ‌వం వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే ఈ సీజ‌న్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు పేలవంగా రాణిస్తున్న నేప‌థ్యం లో కూడా వ్యూయ‌ర్‌షిప్ త‌గ్గుతుంద‌ని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version