Acharya: ఆ టైంలో గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి..‘ఆచార్య’పై రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ పిక్చర్ ‘ఆచార్య’ ఈ నెల 29న విడుదల కానుంది. తండ్రీ తనయులు చిరంజీవి- రామ్ చరణ్ లు కలిసి నటించిన ఫుల్ లెంగ్త్ ఫిల్మ్ చూసేందుకు మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ మూవీ ప్రమోషనల్ యాక్టివిటీస్ షురూ చేశారు మేకర్స్. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకులు కొరటాల శివకు తాజాగా ఇంటర్వ్యూలో ‘ఆచార్య’ గురించి ముచ్చటించారు. ఈ సందర్భంగా చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన జీవితంలో చిరంజీవితో కలిసి పని చేయడం గొప్ప అనుభూతి అని రామ్ చరణ్ చెప్పారు. ఈ క్రమంలోనే యాంకర్ గాయత్రి భార్గవి అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు దర్శకులు కొరటాల శివ, రామ్ చరణ్. ‘ఆచార్య’ చిత్రం చేస్తున్నపుడు కష్టంగా అనిపించిన సమయం గురించి చెప్పాలని యాంకర్ అడగగా, రామ్ చరణ్ ఆ విషయం గురించి చెప్పారు.

తన తండ్రి చిరంజీవితో సాంగ్ చేయాలని చెప్పినపుడు తనకు చాలా భయమేసిందని చెప్పాడు. ఊరికెనే తనకు చెమటలు పట్టేవని అన్నాడు. ఈ క్రమంలోనే తన గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు రామ్ చరణ్. కొంత టైం పాటు స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండిపోయానని చివరకు ఆర్టిస్ట్ గా కొంచెం కవర్ చేశానని పేర్కొన్నాడు.

అలా రిహార్సల్స్ చేసిన తర్వాతనే పాట షూట్ చేశామని వివరించాడు. ఆ సాంగ్ ‘భలే భలే బంజారా’ కాగా, దానిని శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఇటీవల విడుదలైన ఈ పాటను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తు్న్నారు. మొత్తంగా ‘ఆచార్య’ సినిమాపైన అంచనాలను ఇంకా పెంచే విధంగా ఈ ఇంటర్వ్యూ కొనసాగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version