సెప్టెంబర్ 19 నుంచి జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ ఎడిషన్ కోసం ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే బీసీసీఐ ఆయా టీంలకు ఆగస్టు 19 నుంచి దుబాయ్‌కు వెళ్లవచ్చని చెప్పింది. దీంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీం దుబాయ్‌కి ప్రయాణమైంది. గురువారం ఆ జట్టు సభ్యులు, సిబ్బంది ఏయూఈకి ప్రయాణమయ్యారు.
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీం సభ్యులు గత కొద్ది రోజుల కిందటి నుంచే క్వారంటైన్‌లో ఉన్నారు. బీసీసీఐ సూచనల మేరకు వారందరూ కోవిడ్ పరీక్షలు రెండు సార్లు చేయించుకున్నారు. కాగా ఆ జట్టు సభ్యులు విమానంలో దుబాయ్‌కు వెళ్తున్న ఫొటోలను షేర్ చేశారు. వారిలో మహమ్మద్ షమీ కూడా ఉన్నాడు. మేమందరం దుబాయ్ వెళ్తున్నామని అతను ట్వీట్ చేశాడు.
#SaddeFans, lo tuhadde lai good morning gift 🤩#SaddaPunjab #IPL2020 pic.twitter.com/eXn0iULZW1
— Kings XI Punjab (@lionsdenkxip) August 20, 2020
Shami bhai, Shami bhai, aagaye ne 🤩#SaddaPunjab #IPL2020 @MdShami11 pic.twitter.com/Cb766zZd7h
— Kings XI Punjab (@lionsdenkxip) August 20, 2020
కాగా ఐపీఎల్ 13వ ఎడిషన్ నేపథ్యంలో దుబాయ్ వెళ్తున్న మొదటి టీంగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీం అవతరించింది. ఇక ఐపీఎల్‌కు చెందిన మిగిలిన అన్ని టీంలు మరో రెండు, మూడు రోజుల్లో దుబాయ్ వెళ్లనున్నాయి.