హిజాబ్​లు కాల్చుతూ ఇరాన్ మహిళల ఆందోళన

-

ఇరాన్​లో మహిళల హక్కుల అణచివేతపై పెద్ద ఎత్తున నిరసన జరుగుతోంది. మహిళలంతా జుట్టు కత్తిరించుకుంటూ.. హిజాబ్​లను తగలేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల కస్టడీలో ఓ యువతి మృతి చెందటంతో పోలీసులు, చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు.

ఇరాన్​లో షరియా చట్టం ప్రకారం ఏడేళ్లు దాటిన మహిళలు జుట్టును పూర్తిగా కప్పేసేలా హిజాబ్​ ధరించాలి. ఈ నియమాన్ని మరింత కఠినతరం చేస్తూ ఈ ఏడాది జులైలో అధ్యక్షుడు ఇబ్రహిం రైసీ ఉత్తర్వులు జారీ చేశారు. హిజాబ్‌ చట్టాన్ని ఉల్లంఘించే మహిళలకు జరిమానాలతో పాటు అరెస్టులు కూడా చేసేలా అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘మొరాలిటీ పోలీసు’ విభాగాన్ని ఏర్పాటు చేశారు.

మహ్సా అమిని అనే 22 ఏళ్ల మహిళ హిజాబ్‌ను సరిగ్గా ధరించలేదన్న ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీలో ఉన్నఆమె గుండెపోటుకు గురై కోమాలోకి వెళ్లిపోయింది. చికిత్స పొందుతూ గత శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. కస్టడీలో పోలీసులు ఆమెను తీవ్రంగా హింసించారని కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆరోపిస్తున్నారు.

అమిని మృతికి నిరసనగా.. ఇరాన్​ మహిళల హక్కులను రాసే చట్టాలకు వ్యతిరేకంగా మహిళలు నిరసన గళమెత్తారు. టెహ్రాన్‌లో అనేక మంది మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. అటు అమిని స్వస్థలంలోనూ నిరసనలు జరిగాయి. దీంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అదుపు చేస్తున్నారు. బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version