IRCTC కేరళ టూర్… వీటినన్నిటిని చూసొచ్చేయచ్చు…!

-

ఐఆర్‌సీటీసీ ఎన్నో టూర్ ప్యాకేజీలను తీసుకు వస్తోంది. వీటి ద్వారా మనషి తక్కువ డబ్బులకే మీకు నచ్చిన ప్రదేశాలకి వెళ్లి వచ్చేయచ్చు. దేశంలోని వేర్వేరు పర్యాటక ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలను ఐఆర్‌సీటీసీ తీసుకు వస్తోంది. తాజాగా టూరిజం గ్రాండ్ మలబార్ పేరుతో కేరళకు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఐఆర్‌సీటీసీ టూరిజం గ్రాండ్ మలబార్ టూర్ ప్యాకేజీను తీసుకు వచ్చింది. అయితే ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ.

 

ఈ ప్యాకేజీ ద్వారా కొచ్చి, మున్నార్, అలెప్పీ, త్రివేండ్రం లాంటి ప్రాంతాలను చూసి వచ్చేయచ్చు. మే 3న టూర్ ప్రారంభమై ఈ టూర్ మే 8న ముగుస్తుంది. ఇక ఈ టూర్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఐఆర్‌సీటీసీ టూరిజం గ్రాండ్ మలబార్ టూర్ ప్యాకేజీ మొదటి రోజు హైదరాబాద్‌లో మొదలు అవుతుంది. తెల్లవారుజామున 5.45 గంటలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ ఎక్కితే కొచ్చిన్ విమానాశ్రయానికి ఉదయం 7.20 గంటలకు రీచ్ అవుతారు.

హోటల్ లో చెక్ ఇన్ అయ్యాక ఫోర్ట్ కొచ్చి, డచ్ ప్యాలెస్, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్, మెరైన్ డ్రైవ్ చూడచ్చు. రాత్రి అక్కడే స్టే చెయ్యచ్చు. రెండో రోజు ఉదయం మున్నార్ వెళ్ళాలి. దారిలో చీయపార వాటర్ ఫాల్స్, టీ మ్యూజియం చూడచ్చు. రాత్రికి మున్నార్‌లో స్టే చెయ్యాలి. మూడో రోజు మున్నార్ సైట్ సీయింగ్ ఉంటుంది. మెట్టుపెట్టి డ్యామ్, ఇకో పాయింట్, కుండ్లా డ్యామ్ లేక్ చూడచ్చు.

నాలుగో రోజు ఉదయం అలెప్పీ చూడచ్చు. వెంబనాడ్ సరస్సులో బోటింగ్ ఉంటుంది. ఐదో రోజు ఉదయం త్రివేండ్రం బయల్దేరాలి. దారిలో జటాయు ఎర్త్ సెంటర్ చూడచ్చు. రాత్రికి త్రివేండ్రంలో స్టే చేయాలి. ఆరో రోజు శ్రీ పద్మనాభస్వామి ఆలయం చూడచ్చు. త్రివేండ్రం విమానాశ్రయంలో రాత్రి 9.40 గంటలకు ఫ్లైట్ ఎక్కితే రాత్రి 11.25 గంటలకు హైదరాబాద్ చేరుతారు. ఇక ప్యాకేజీ ధరలను చూస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.26,550, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.28,000, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.36,550 చెల్లించాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version