ఇక పై రైల్వే ప్రయాణీకులకూ క్రెడిట్ కార్డులు..! ఎన్నో ఆఫర్లు, సౌకర్యాలు!

-

ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటినుంచో చెబుతున్న ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మ నిర్భర్ భారత్’ కలను సాకారం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేసింది. ‘డిజిటల్ ఇండియా’ పేమెంట్స్ దిశగా ఎంతో పరిణితి సాధించిన భారత ప్రభుత్వం ఇప్పుడు రైల్వేలలో కూడా అత్యాధునిక టెక్నాలజీని ప్రవేశపెట్టింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి గోయల్ కొత్త తరహా క్రెడిట్ కార్డుని ఐఆర్సిటిసి – ఎస్బిఐ బ్యాంకింగ్ మరియు రుపే కార్డు వారి అనుసంధానంతో త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు.

ప్రధానమంత్రి కల అయిన ‘ఆత్మ నిర్భర్ భారత్’, ‘డిజిటల్ ఇండియా’ వైపు తాము వేసిన కీలక అడుగు ఇది అని చెప్పిన విషయం పియూష్… త్వరలోనే ఐఆర్సిటిసి-ఎస్బిఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని…. దీని ద్వారా ఎన్నో విశేష సేవలను రైల్వే డిపార్ట్మెంట్ వారు ప్రజలకు అందించనున్నారని తెలిపారు. ఇక ఈ క్రెడిట్ కార్డు ద్వారా రైల్వే కు సంబంధించిన లావాదేవీలన్నీ ఆన్లైన్లో డిజిటల్ గా సురక్షితంగా జరుగుతాయని…. ఈ కార్డును ఉపయోగించి రైల్వేస్టేషన్లోని పిఓఎస్ మిషన్లలో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సి) టెక్నాలజీ ద్వారా కేవలం మన కార్డు ని అలా టాప్ అనగా టచ్ చేస్తే చాలు దానికి సంబంధించిన ఆప్షన్లు మనము సెలెక్ట్ చేసుకునేందుకు వీలు ఉంటుంది.

అలాగే వృత్తి రీత్యా గాని వ్యాపారరీత్యా గాని తరచూ రైలు ప్రయాణం చేస్తున్న వారికి అదనపు బెనిఫిట్స్ ఉండేలాగా ప్రభుత్వం ఈ కార్డుని తీసుకొని వచ్చింది. ఎన్నో అత్యాధునిక సౌకర్యాలతో పాటు ఏసీ, సెకండ్ ఏసి, థర్డ్ ఏసి, ఎగ్జిక్యూటివ్ చైర్, ఏసి కార్ చైర్ వినియోగదారులకు 10% వాల్యూ బ్యాక్ సదుపాయాన్ని కూడా కల్పించింది. అలాగే ఈ కార్డు ద్వారా ఒక పర్సెంట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఫీజు ఏమాత్రం ఉండదు సరికదా సంవత్సరానికి నాలుగు సార్లు అంటే మూడు నెలలకు ఒకసారి లౌంజ్ ఫ్రీ ప్రయాణం కూడా చేయవచ్చు.

అంతే కాకుండా తరచూ ఈ కార్డును వాడిన వారికి రైల్వే డిపార్ట్మెంట్ వారు 350 వాల్యూ యాడెడ్ పాయింట్స్ ఇస్తారు. ఈ పాయింట్స్ ద్వారా దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లలో ఎన్నో డిస్కౌంట్లు పొందవచ్చు. అలాగే షాపింగ్ మాల్స్, ఈ-కామర్స్ సైట్స్ లో ఈ కార్డు ద్వారా ఎన్నో ఆఫర్లు, డిస్కౌంట్లు లభిస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version