కాంగ్రెస్‌కు ఏలేటి గుడ్‌బై? కమలం గూటికి?

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగలనుందా? పార్టీ కీలక నేత..పార్టీని వీడబోతున్నారా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తే నిర్మల్ కు చెందిన కాంగ్రెస్ కీలక నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని వీడటం ఖాయమని తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఏలేటికి..రేవంత్ రెడ్డితో విభేదాలు ఉన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే రేవంత్ పై పలుమార్లు విమర్శలు చేశారు. అలాగే తనని ఎదగనివ్వకుండా చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇక రేవంత్ వైఖరిపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఉపయోగం లేదని తెలిసింది. ఆ మధ్య రేవంత్‌కు పోటీగా ఆయన పాదయాత్ర చేపట్టడం గుబులు రేపింది. కానీ అధిష్టానం పాదయాత్ర ఆపేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడంతో మధ్యలోనే పాదయాత్రకు బ్రేక్ పడింది. ఈ నిర్ణయం మహేశ్వర్ రెడ్డిలో అసంతృప్తిని మరింత పెంచిందనే వాదనలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఆయన ఈ మధ్య కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. తాజాగా  నిర్మల్ నియోజకవర్గంలో తన అనుచరులతో మహేశ్వర్ రెడ్డి సీక్రెట్ మీటింగ్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశం నియోజకవర్గ కాంగ్రెస్‌లో దుమారం రేపింది. పార్టీ మార్పుపై చర్చించేందుకు అనుచరులతో మహేశ్వర్ రెడ్డి రహస్య భేటీ నిర్వహించారనే ప్రచారం జరుగుతోంది.

దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ టీపీసీసీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ వీడటానికి రెడీ అయినట్లు తెలిసింది. కాగా, 2009లో ప్రజారాజ్యం నుంచి నిర్మల్ లో గెలిచిన ఏలేటి..2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరి ఇప్పుడు ఆయన బి‌జే‌పిలోకి వెళ్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version