అమెరికా ఇక చరిత్రేనా…?

-

అమెరికా ఇక చరిత్రేనా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అమెరికాలో ఇప్పుడు నమోదు అవుతున్న కరోనా కేసులు ప్రపంచాన్ని కూడా భయపెడుతున్నాయి. అసలు ఆ దేశంలో నమోదు అవుతున్న కేసులు అక్కడి వైద్యులకు కూడా అంచనాకు రావడం లేదు. ఒక్క రోజు పది వేల కేసులు 11 వేల కేసులు నమోదు కావడం అనేది మరింతగా భయపెడుతుంది. కరోనాను కట్టడి చేయడానికి అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.

ఇప్పటి వరకు ఆ దేశంలో దాదాపు 60 వేల మందికి కరోనా సోకింది. దాదాపు రెండు వేల మందికి కరోనా వైరస్ సోకింది. అనేక విధాలుగా అమెరికాలో కరోనా వ్యాపిస్తుంది. ప్రస్తుతం ఆ దేశంలో కరోనా వైరస్ కట్టడి అవ్వడం అనేది సాధ్యం అయ్యే పని కాదు. మరణాలు అనేవి భారీగా నమోదు అవుతాయని అంటున్నారు. కొన్ని నగరాలు కరోనా దెబ్బకు తుడిచి పెట్టుకుని పోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

కరోనా వ్యాప్తిని అడ్డుకునే సామర్ధ్యం అమెరికాకు లేదని, మాస్క్ లు సహా వైద్య పరికరాలు కూడా అక్కడ దొరకని పరిస్థితి ఏర్పడింది. అమెరికా ఆర్ధికంగా కూడా ఇప్పుడు భారీగా నష్టపోతుంది. మధ్య ప్రాచ్యంలో తన సైనికులకు కూడా కరోనా వైరస్ సోకింది. అమెరికాలో వైద్యులతో పాటుగా మరికొందరు సైనికులకు ప్రభుత్వంలో వ్యక్తులకు కరోనా వైరస్ సోకింది. దీనితో అమెరికా దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలో అర్ధం కాని పరిస్థితిలో ఉంది.

ప్రజలను బయటకు రానీయకుండా అడ్డుకోవాలని చూసినా అది సాధ్యం కావడం లేదు. కరోనా వైరస్ వ్యాప్తి అనేది అడ్డుకునేది కాదని అమెరికాలో కొందరు అంటున్నారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అమెరికాలో దాదాపు 30 లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని, అమెరికాలో ప్రభుత్వం కూడా దాదాపుగా చేతులు ఎత్తేసింది అనే అంటున్నారు. ఇప్పుడు ఆ దేశం ఆర్ధికంగా నిలబడాలి అంటే మాత్రం దాదాపు 30 ఏళ్ళు పడుతుందని ఆ స్థాయిలో నష్టం జరిగింది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version