ఆహారం నమిలేప్పుడు, మింగేప్పుడు నొప్పిగా ఉంటుందా.. అయితే అది ఈగల్ సిండ్రోమ్ కావచ్చేమో..!

-

కొంతమందికి ఆహారం మింగేప్పుడు నోట్లో ఏదో అడ్డుపడినట్లుగా, ఏదో పొడుచుకున్నట్లుగా అనిపిస్తుంది. దీన్నే ఈగల్ సిండ్రోమ్ అంటారు. అయితే..వీటిపై పెద్దగా అవగాహన లేక..ఏదో నొప్పిగా ఉందిలే అనుకుని లైట్ తీసుకుంటారు. అనవసరమైన టాబ్లెట్స్ కూడా వాడుతుంటారు..సమస్యను తొలి దశలోనే తగ్గించుకుంటే..సర్జరీ వరకూ వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈగల్ సిండ్రోమ్ తీవ్రత పెరిగితే కచ్చితంగా సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది..కాబట్టి.. ఈరోజు ఈగల్ సిండ్రోమ్ ఎందుకువస్తుంది, నాచురల్గా తగ్గించుకునే మార్గాలు చూద్దాం.

ఈగల్ పెయిన్ రావడానికి కారణాలు?

మనకి దవడ బోను ఉంటుంది కదా..దాని వెనుకల భాగంలో చెవుకింద భాగంలో ఒక ఎముక ఉంటుంది. దానికి గొంతులో ఉండే..లారినిక్స్ (Larynx) పారినిక్స్( Pharynx) మనం గుటక వేసే భాగానికి ఒక లిగమెంట్ (Ligament) కనక్ట్ అయి ఉంటుంది. ఈగల్ సిండ్రోమ్ రావడానికి రెండు కారణాలు ఉంటాయి. ఈ దవడకింద బోను ఎదగడం వల్ల కూడా పెయిన్ వస్తుంది. లిగమెంట్ కి కాల్షియం బాగా పేరుకుపోయినా కూడా పెయిన్ వస్తుంది. దానివల్లే నమిలేప్పుడు దవడ భాగం దగ్గర, చెవు దగ్గర పెయిన్ వస్తుంది.

నాచురల్గా ఈగల్ సిండ్రోమ్ తగ్గించుకునే మార్గాలు :

ఘూటింగ్ పెయిన్ ఎక్కువగా ఉంటే..ఆ భాగంలో ఐస్ కాపడం పెట్టుకోవటం మంచిది. కేవలం నొప్పి మాత్రమే ఉంటే..పిప్పరమెంట్ ఆయిల్ కానీ, యూకలిప్టస్ ఆయిల్ కానీ అప్లైయ్ చేసి వేడినీళ్ల కాపడటం పెట్టుకోవచ్చు.

లిగమెంట్ మీద వచ్చిన కాల్సిఫికేషన్ తగ్గించడానికి జ్యూస్ ఫాస్టింగ్ చేయటం చాలా మంచిది. తినేప్పుడు గొంతునొప్పి ఉన్నవారు..సాలిడ్ ఫుడ్ మానేయాలి..ఇంకా నొప్పి ఎక్కువ అవుతుంది. అందుకే ఫ్రూట్ జ్యూసులు తాగితే నొప్పినుంచి కాస్త ఉపశమనం ఉంటుంది.

వేడివేడి నీళ్లు తీసుకుని అందులో మూడు స్పూన్ల తేనె, ఒక నిమ్మచెక్క రసం పిండుకుని.. టీ తాగినట్లు తాగాలి. తేనె నీళ్లు తాగిన గంట తర్వాత మంచినీళ్లు కూడా వేడిగా తీసుకుని..టీ తాగినట్లే స్లోగా తాగండి. మళ్లీ ఒక అరగంట తర్వాత కూడా ఇలానే వాటర్ తాగి..ఆ తర్వాత మళ్లీ తేనె నీళ్లు తాగుతూ..ఇలా 2-3 రోజులు తేనె నిమ్మరసం నీళ్ల మీద ఉంటే..పెయిన్ బాగా తగ్గుతుంది. ఆ తర్వాత ఇంకో రెండురోజులు పాటు.జ్యూస్ తాగుతుంటుంటే మొత్తంగా ఐదురోజుల్లో నొప్పి తగ్గుతుంది.

తేలిగ్గా ఉండే ఫ్రూట్స్ ను నమలాలి. గట్టిగా ఉండే పళ్లు తింటే..ఘూటింగ్ పెయిన్ ఇంకా పెరుగుతుంది.

రోజు ఉదయం, సాయంత్రం వేడినీళ్లలో కాస్త ఉప్పువేసి పుక్కులించి ఊయటం చేస్తూ ఉన్నా కూడా..ఇరిటేషన్ తగ్గుతుంది. ఇంకా ఈ సమయంలో తలనొప్పి కూడా వస్తుంది కాబట్టి..అలాంటప్పుడు వేడినీళ్లలో పాదాలు పెట్టుకుంటే..కాస్త రిలీఫ్ వస్తుంది. హాయిగా ఉంటుంది.

ఇలాంటివి చేసుకుంటే ఉంటే నొప్పి దాదాపు తగ్గుతుంది. కొందరిలో లిగమెంట్ మీద కాల్షియం ఎక్కువగా పేరుకపోయి..నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇక వారికి సర్జరీ చేయాల్సిందే. చాలామందికి సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడదు..దాదాపు నాచురల్గా పైన చెప్పిన పద్ధతులను ఫాలో అయితేనే..నొప్పి తగగ్గుముఖంపడుతుంది. కొందరిలోనే సర్జరీ వరకు వెళ్లాల్సి వస్తుంది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version