రాష్ట్రపతి ఎన్నికల్లో.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మంత్రి డుమ్మా..

-

భారతదేశానికి 16వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు నేడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. అయితే కొన్ని కొన్ని చోట్ల కోవిడ్‌ బారిన పడ్డ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పీపీఈ కిట్లలో వచ్చి మరీ ఓట్లు వేశారు. అయితే.. ఈ ఓటింగ్ కు టీఆర్ఎస్ మంత్రి సహా ఓ ఎమ్మెల్యే దూరంగా ఉన్నారు. మంత్రి గంగుల కమలాకర్ కు కరోనా రావడంతో ఈ ఎన్నికలో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకోలేదు. అదే విధంగా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ జర్మనీలో ఉన్నందున ఆయన కూడా తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. శాసనసభ కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్ లో మంత్రి కేటీఆర్ ఫస్ట్ ఓటు వేశారు.

ఆ తర్వాత సీఎం కేసీఆర్ సహా మంత్రులు, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మజ్లీస్ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం అనుమతితో ఏపీ వైసీపీ ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి రాష్ట్ర అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలు ఈ నెల 21న రానున్నాయి. 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ ఎన్నికలో మెజార్టీ పార్టీలు ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకి మద్దతిచ్చాయి. ఆమె 63 శాతానిపైగా మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. క్రాస్ ఓటింగ్ జరిగితే మెజార్టీ మరింత పెరిగే అవకాశం ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version