తండ్రి ఎన్ని దాన ధర్మాలు చేసినా సరే కొడుకు వంద రూపాయలు దొంగ తనం చేసినా దొంగల ఫ్యామిలీ, వాళ్ళు దొంగతనాలు చేసి దానం చేస్తున్నారని అంటారు జనాలు. సమాజం అలాగే చచ్చింది లోకం కూడా అలాగే ఉంది. ఏపీలో సిఎం జగన్ కి ఇది బాగా సరిపోతుంది… అసలు ఏంటీ యవ్వారం అనేది చూస్తే… అన్నేమో అమ్మో సొప్పో చేసి పాదయాత్రలో ఇచ్చిన హామీలు, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తుండే. కాళ్ళు అరిగేలా తిరిగి గెలిచిన జగన్… ఆ తర్వాత విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా సంక్షేమం అమలు చేస్తున్నారు.
కాని అన్న పేరుకే తంటా తెస్తున్నారు మంత్రులు… ఒక మంత్రి గారి వ్యవహారం చూద్దాం. రాయలసీమకు చెందిన ఒక మంత్రి గారు అంటే సిఎం జగన్ యెనలేని ప్రేమాభిమానాలు. సిఎం జగన్ ఏ నిర్ణయం రాజకీయంగా పాలనా పరంగా తీసుకున్న సరే సదరు మంత్రి గారి సలహా లేకుండా ముందుకు వెళ్ళే వారు కాదు. ఇప్పుడు కూడా అంతే… రాజకీయంగా వైసీపీ బలపడటానికి, సిఎం గా జగన్ పదవిలోకి రావడానికి సదరు మంత్రి గారి సుధీర్గ రాజకీయ అనుభవమే ప్రధాన కారణం అని అంటూ ఉంటారు.
ఆయనకు పార్టీలో కూడా చాలా గౌరవం ఉంటుంది. సిఎం జగన్ కుడి ఎడమ భుజాలు ఉన్నా సరే మంత్రి గారు ఫోన్ చేస్తే జగన్ కూడా గౌరవిస్తారు మాట్లాడతారు. కాని ఆ మంత్రి గారే జగన్ కు సమస్య అయ్యారు. స్థాయి మరిచి ఆయన కొన్ని వివాదాల్లో తల దూరుస్తున్నారు. ఆయన అనుచరుల కారణంగా మంత్రి గారికి చెడ్డ పేరు వస్తుందని వైసీపీ నేతలు అంటున్నా సరే సదరు మంత్రి గారు కట్టడి చేయడం లేదు. విలేఖరి ఇంటికి వెళ్లి నానా అల్లరి చేసారు, ఒక దళితుడు ఏదో మాట్లాడితే వేధించి నానా ఇబ్బందులు పెట్టారు.
అతను ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళింది పరిస్థితి. సిఎం జగన్ కూడా అన్నా చూడరాదే ఒకసారి అని చెప్పారు. అదేం లేదు మాట్లాడతా అన్నారు. కాని పరిస్థితి మాత్రం అదుపులోకి రావడం లేదు. ఇటీవల వరుస వివాదాల్లో మంత్రి గారు చిక్కుకుంటున్నారు. జగన్ ఏమో నానా కష్టాలు పడి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి చంద్రబాబు అనుభవం మీదనే దెబ్బ కొడితే మంత్రి గారి వల్ల జగన్ కు చెడ్డ పేరు వస్తుంది.