ద్వారంపూడికి జనసేనతోనే చెక్..కాకినాడ లెక్కలు ఇవే!

-

వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీకి చెక్ పెట్టడానికి టి‌డి‌పి-జనసేన ఏకమవుతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు పొత్తు దిశగా ముందుకెళుతున్నాయి. గత ఎన్నికల్లో పొత్తు లేకపోవడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి బెనిఫిట్ అయింది. కానీ ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని చెప్పి చంద్రబాబు-పవన్ కలిసి ఎన్నికల బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతానికి అధికారికంగా మాత్రం పొత్తు ఫిక్స్ అవ్వలేదు గాని..అనధికారికంగా పొత్తు ఖాయమని రెండు పార్టీలు ఫిక్స్ అయ్యాయి.

అయితే పొత్తులో భాగంగా టి‌డి‌పి..జనసేనకు ఏ సీట్లు ఇస్తుంది..జనసేన ఏ సీట్లు అడుగుతుందనేది పూర్తిగా క్లారిటీ రావడం లేదు. కానీ కొన్ని సీట్లని టి‌డి‌పి..జనసేన కోసం వదిలేసినట్లే కనిపిస్తుంది. ఇదే క్రమంలో కాకినాడ సిటీ సీటుని జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై జనసేన శ్రేణులు ఎంత కసితో ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. ద్వారంపూడి..పవన్‌ని తిట్టిన తిట్లని మర్చిపోలేదు. జనసేన శ్రేణులపై ఎమ్మెల్యే అనుచరుల దాడి మర్చిపోలేదని, ఖచ్చితంగా ద్వారంపూడిని ఓడిస్తామని జనసేన శ్రేణులు అంటున్నాయి.  కానీ సింగిల్ గా జనసేన..ద్వారంపూడిని ఓడించలేదు. అటు టి‌డి‌పి సైతం ఒంటరిగా ఇక్కడ వైసీపీకి చెక్ పెట్టడం కష్టమని తెలుస్తోంది. ఒంటరిగా బరిలో ఉంటే ద్వారంపూడిదే పైచేయి అని తెలుస్తోంది.

అందుకే రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని ముందుకొస్తున్నాయి. పొత్తులో భాగంగా ఈ సీటుని జనసేనకు ఇస్తారని తెలుస్తోంది. పొత్తులో పోటీ చేస్తే ఇక్కడ ద్వారంపూడికి చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి 2019 కాకినాడ సిటీ ఫలితం చూస్తే..వైసీపీకి సుమారు 73 వేల పైనే ఓట్లు పడగా, టి‌డి‌పికి 59 వేల ఓట్లు పడ్డాయి. జనసేనకు 30 వేల ఓట్లు పడ్డాయి. అంటే టి‌డి‌పిపై 14 వేల ఓట్ల మెజారిటీతో ద్వారంపూడి గెలిచారు. కానీ అప్పుడే జనసేనతో పొత్తు ఉంటే ద్వారంపూడి గెలవడం డౌటే. ఈ సారి అందుకే రెండు పార్టీలు పొత్తులో వచ్చి ద్వారంపూడికి చెక్ పెట్టాలని చూస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version