Pawan Kalyan: మూడు పెళ్లిళ్లపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!!

-

నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరో ప్రభాస్ ఎపిసోడ్ కార్యక్రమం ఇటీవలే ముగిసింది. దీంతో ఆహా షో ఏకంగా సర్వర్లు క్రాస్ అయ్యేలా చేసింది.అంతటి క్రేజ్ సంపాదించుకుంది ఈ షో. ఇక ఈసారి గెస్ట్ గా పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. దీంతో అభిమానులు ఈ షో కోసం చాలా ఆతృతగా ఎదురు చూశారు. పవన్ కళ్యాణ్ తొలి ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా హంగామా తారస్థాయికి చేరుకుంది. అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ పవన్ బాలయ్య తొలి ఎపిసోడ్ నిన్న రాత్రి 9 గంటలకు ఆహ లో స్ట్రీమింగ్ అయింది.

అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం.. మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్ ఓపెన్ అయ్యారు. ఎపిసోడ్లో భాగంగా ఈ పెళ్లిలో గోల ఏంటి భయ్యా అని బాలయ్య ప్రశ్నించగా.. తన మొదటి పెళ్లి నుంచి అన్ని వివరాలు పూసగుచ్చినట్లు వివరించారు పవన్ కళ్యాణ్.. పవన్ సమాధానం ఇస్తూ నాకు మొదటి వివాహం జరిగే సమయానికి పెళ్లి అంటే సరైన అవగాహన లేదు. పెళ్లికి ప్రిపేర్ అవలేదు . కానీ కుటుంబ సభ్యులు వివాహం చేశారు. అందుకే మొదటి భార్యతో అభిప్రాయాలు కుదరక విడిపోవాల్సి వచ్చింది. రెండవ భార్యతో కూడా అభిప్రాయ బేధాలు వచ్చాయి. అందుకే రెండవ పెళ్లి కూడా పోయింది. ఆ తర్వాత మూడవ వివాహం చేసుకున్నాను అంటూ తెలిపారు పవన్

మొదట తనకు పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన లేదు అని ..ఒక యోగి లాగా మారుదామని అనుకున్నానని జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండాలనే ఆలోచన ఉండేది.. కానీ అనుకోకుండా చేసుకోవాల్సి వచ్చింది. రాజకీయంగా పెళ్లిళ్ల విషయంలోనే నన్ను విమర్శిస్తున్నారు. నన్ను తిట్టడానికి వాళ్లకు వేరే కారణం లేదు కాబట్టి ఇలా పాయింట్ అవుట్ చేస్తున్నారు అంటూ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version