ఎన్టీఆర్ తన అభిమాన నాయకుడు అని పొగిడిన ముఖ్యమంత్రి కెసిఆర్..వైస్రాయ్ హోటల్ లో ఎన్టీఆర్ పై చెప్పులు విసిరిన వారిలో మీరు లేరా అంటూ ప్రశ్నించారు.ఎన్టీఆర్ ను అవమానించిన వ్యక్తే మళ్లీ తిరిగి పొగిడే ప్రయత్నం చేస్తున్నారన్నారు.తెరాస ఆస్తి రూ.వెయ్యి కోట్లు అని సీఎం కేసీఆర్ ప్లీనరీలో ప్రకటించారని..అది మాత్రం నిజం చెప్పారు అని సంజయ్ వెల్లడించారు.ధాన్యం కొనుగోళ్లు కేంద్రం చేస్తుంటే..ప్లీనరీలో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానం అంటూ ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు.
కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 575 టీఎంసీలు రావాల్సి ఉందని..కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకున్న ఒప్పందం ప్రకారం 299 టీఎంసీలు మాత్రమే వస్తుందని ఆయన ఆరోపించారు.తెరాస తీసుకొచ్చిన తీర్మానాలు తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడతాయా అంటూ ప్రశ్నించారు.రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెరాసకు- కాంగ్రెస్ కు అనుకూలంగా పని చేస్తున్నారని..అంటే ఆ రెండు పార్టీలు ఒక్కటేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.ఎవరెన్ని చేసినా మోదీ సర్కార్ ను ఏం చేయలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రానికి తెరాస ప్రభుత్వం చేసింది ఏమీ లేదని..ప్లీనరీ కూడా ఫెయిల్ అయిందని విమర్శించారు.