ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాలు అన్నీ డిసెంబర్ లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. గత రెండు పర్యాయాలుగా కేసీఆర్ తన పార్టీని ఎన్నికలలో గెలిపించుకుంటూ అధికారంలో ఉన్నాడు. వరుసగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న కసితో పార్టీలో నాయకులు అంతా కలిసి కట్టుగా పని చేస్తున్నారు. కాగా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ BRS గెలిస్తే సీఎం ఎవరు కానున్నారు అన్న విషయంపై తెలంగాణ రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఎన్నికలలో BRS పార్టీ నుండి కేసీఆర్ తనయుడు మరియు ప్రస్తుతం ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ముఖ్యంన్త్రి అభ్యర్థిగానే ఎన్నికలకు వెళ్లనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందుకు కేటీఆర్ మా పార్టీకి ఎప్పుడూ కేసీఆర్ ముఖ్యమంత్రి అని సమాధానం ఇచ్చారు. అయితే పరిస్థితులు అన్నివేళలా ఒకేలా ఉండవు.
కేటీఆర్ సీఎం అభ్యర్థిగా ఎన్నికలకు వెళ్లనున్నారా ?
-