వేటు పడకముందే కారు దిగనున్న మైనంపల్లి?

-

ఏదో అనుకుంటే..ఇంకేదో అయినట్లు ఉంది…బి‌ఆర్‌ఎస్ పార్టీలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వ్యవహారం..కరెక్టుగా కే‌సి‌ఆర్..ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల లిస్ట్‌ని విడుదల చేసే ముందే..మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. జాబితా వెలువడటానికి ముందే తన కుమారుడు రోహిత్‌కు మెదక్ అసెంబ్లీ టికెట్ ఇస్తే సరి.. లేదంటే ఊరుకోబోనని మాట్లాడారు.

హరీష్ రావు బట్టలు ఊడతీసే వరకు నిద్రపోనని,  సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని, రాజకీయంగా ఎంతో మందిని అణిచివేశాడని.. అక్రమంగా లక్షల కోట్లు సంపాదించారని ఆరోపణలు చేశారు. హరీష్ రావు తన నియోజక వర్గాన్ని వదిలేసి మెదక్‌లో ఎందుకు పెత్తనం చేస్తున్నారని, మెదక్ అంటే ఓ కీప్ మాదిరిగా చూస్తున్నారని, హరీష్ మెదక్ లో వేలు పెడితే..తాను సిద్ధిపేటలో వేలు పెడతానని అన్నారు.

అయితే ఈ వ్యాఖ్యలు చేశాక బి‌ఆర్‌ఎస్ లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ లో మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు ఉంది. దీనిపై అప్పుడే కే‌సిఆర్ మీడియా ప్రశ్నలు వేయగా, ఏమైనా ఎక్కువ చేస్తే తీసి అవతల వేస్తామని అన్నారు. అటు కే‌టి‌ఆర్, కవితలు సైతం…మైనంపల్లి వ్యాఖ్యలని ఖండించారు. మళ్ళీ మైనంపల్లి వెనక్కి తగ్గి..తాను పార్టీని ఏం అనలేదని, తన వ్యాఖ్యలు వ్యక్తిగతమని చెప్పుకొచ్చారు.

అయినా సరే బి‌ఆర్‌ఎస్ అధిష్టానం మైనంపల్లిపై సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. మైనంపల్లిపల్లిపై సొంత పార్టీ నేతలు మండి పడుతున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయనపై వేటుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక మైనంపల్లి సైతం తన కార్యాచరణ రెండు రోజుల్లో ప్రకటిస్తానని అన్నారు. అంటే వేటు పడకముందే మైనంపల్లి బి‌ఆర్‌ఎస్‌ని వీడాతారా? లేక వేటు పడ్డాక ఏం చేస్తారనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version