జబర్దస్త్ ద్వారా భారీగా పాపులారిటీ అందుకున్న వారిలో యాంకర్ అనసూయతో పాటు కమెడియన్ సుధీర్ అలాగే యాంకర్ రష్మీ కూడా ఒకరిని చెప్పాలి. గత కొంతకాలంగా జబర్దస్త్ లో జరుగుతున్న పరిణామాల వల్ల ఒక్కొక్కరుగా జబర్దస్త్ నుంచి బయటకు వస్తున్నారు. ఈ క్రమంలోనే మొదట సుధీర్ బయటకు వచ్చి .. పలు సినిమా షూటింగ్లలో బిజీగా మారగా ఆ తర్వాత యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసి ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ ల వెంట పడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా యాంకర్ రష్మీ కూడా వీరి బాటలోనే వెళ్ళబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే జబర్దస్త్ నుంచి అటు అనసూయ, ఇటు సుదీర్ ను.. రెమ్యునరేషన్ అనే వల విసిరి.. తమ వలలోకి లాగిన స్టార్ మా ..ఇప్పుడు రష్మి గౌతమ్ ని కూడా లాగేందుకు ప్రయత్నాలు చేస్తోంది అంటూ కొన్ని రకాల వార్తలు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి.
అనసూయ వెళ్ళిపోయిన తర్వాత జబర్దస్త్ రెండు ఎపిసోడ్స్ కి కూడా రష్మీ గౌతమ్ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. సుధీర్ కూడా వెళ్లిపోవడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ కి కూడా యాంకర్ గా రష్మీ గౌతమ్ నిర్వహిస్తూ ఉండడం గమనార్హం.. ప్రస్తుతం ఈటీవీలో అత్యంత కీలకమైన షోలకు ఆమె ప్రధానంగా మారింది. ఈ సమయంలో స్టార్ మా వాళ్ళు ఆమెకు గాలం వేసి లాగేందుకు ప్రయత్నిస్తున్నారంటూ గుసగుసలు బాగా వినిపిస్తున్నాయి. అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇలాంటి వార్తలు మాత్రం ప్రస్తుతం బాగా వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే ఇటీవల బిగ్ బాస్ స్టేజ్ పై రష్మి గౌతమ్ డాన్స్ చేసి రచ్చ చేసిన విషయం తెలిసిందే…
అంతేకాదు స్టార్ మా వారు నిర్వహించిన ఒక అవార్డు ఫంక్షన్లో కూడా ఈ ముద్దుగుమ్మ సందడి చేసింది. కాబట్టి మెల్లమెల్లగా స్టార్ మా వారు రష్మి గౌతమ్ ని కూడా ఆకర్షించే విధంగా పారితోషకాన్ని ఎరగా చూపిస్తున్నట్లు సమాచారం. మరి స్టార్ మా గాలానికి రష్మీ గౌతమ్ చిక్కుతుందా లేదా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.