మొయినాబాద్‌ ఫాంహౌస్‌ సీసీ ఫుటేజీలు బయటపెట్టాలి: బండి సంజయ్‌

-

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగిన వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోసారి స్పందించారు. మొయినాబాద్‌ సమీపంలోని ఫాంహౌస్‌ సీసీ ఫుటేజీలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. మునుగోడులో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు.

ఆ ఫాంహౌస్‌ టీఆర్ఎస్ ఎమ్మెల్యేదేనని బండి సంజయ్ అన్నారు. అక్కడికి వచ్చిందీ పోలీసులకు ఫిర్యాదు చేసిందీ.. బాధితులుగా ఉన్నదీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనని ఆరోపించారు. ఈ తతంగమంతా పోలీస్‌ కమిషనరే నడిపిస్తున్నారని సంజయ్‌ ఆరోపించారు. ఈ వ్యవహారం నుంచి ఆయన తప్పించుకుంటారా?ఆయన్ను ఎవరు కాపాడతారు? అని వ్యాఖ్యానించారు.

‘‘గత వారంలో రోజుల్లో ప్రగతిభవన్‌కు ఎవరెవరు వచ్చారు.. దిల్లీలో సీఎం కేసీఆర్‌ను ఎవరు కలిశారనే విషయాలన్నీ బయటపెట్టాలి. సీపీ, ఎమ్మెల్యేలు, ఆ స్వామీజీల కాల్‌ లిస్ట్‌ బయటకు తీయాలి. సీఎం ఇంటి ల్యాండ్‌ ఫోన్‌ కాల్‌ లిస్ట్‌ కూడా బయట పెట్టాలి. సీఎం చెప్పిన స్క్రిప్ట్‌ ఒకటి.. అక్కడ జరిగిందొకటి. డబ్బులు దొరికితే మీడియాకు చూపించాలి కదా? ఈ విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తాం. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరగాల్సిందే. మునుగోడు ఉప ఎన్నికతో ముడిపడిన సమస్య ఇది. అందుకే ఈసీ కూడా ఫిర్యాదు చేస్తాం. ’’ అని బండి సంజయ్‌ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version