ఇక దళపతి విజయ్ చివరి సినిమా అదేనా?

-

ఎప్పుడెప్పుడా అని ప్రముఖ తమిళ కథానాయకుడు విజయ్ పొలిటికల్ అరంగేట్రంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు దళపతి విజయ్ శుభ వార్త చెప్పిన విషయం తెలిసిందే.ఇక ఈ పార్టీకి “తమిళ వెట్రి కజగం” అనే పేరు ఖరారు చేశారు హీరో విజయ్ .2026 అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన టార్గెట్ అని విజయ్‌ తెలిపారు. విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడని సంతోషం, మరో పక్క సినిమాలకు దూరమవుతాడు కావొచ్చని బాధపడుతున్నారు.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ “దళపతి 68 “ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. GOAT టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.అయితే ఈ చిత్రం తర్వాత రెండు చిత్రాలు చేసి 70 సినిమాలతో ఆపాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. కానీ 69వ సినిమానే లాస్ట్ సినిమా అవ్వొచ్చు అని కూడా తెలుస్తుంది. DVV ఎంటర్టైన్మెంట్స్ సంస్థకి విజయ్ గతంలో ఓ సినిమా చేస్తానని చెప్పినట్ట్టు ,తన లాస్ట్ చిత్రం DVV ఎంటర్టైన్మెంట్స్ లో ఉంటుందని తెలుస్తుంది.ఇక రాజకీయాల్లోకి వెళ్లేముందు లాస్ట్ మూవీ పొలిటికల్ గా కూడా ఉపయోగపడాలి కాబట్టి ఏదైనా సోషల్ మెసేజ్ తో సినిమా తీయాలని విజయ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో విజయ్ చివరి సినిమా తమిళ్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో తెలుగు నిర్మాత DVV దానయ్య – ఉండబోతుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version