సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుందని చెప్పవచ్చు. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఒకానొక సమయంలో చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల హవా కొనసాగుతున్నప్పుడు ఒక లేడీ.. స్టార్ హీరోలతో సమానంగా గుర్తింపు తెచ్చుకుంది అంటే ఎవరైనా నమ్మగలరా.. ఇక ఇందుకు సమాధానం అవుననే చెప్పాలి.. ఎందుకంటే స్టార్ హీరోలతో పోటీ పడుతూ లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న విజయశాంతి అప్పట్లోనే హీరోలతో సమానంగా పారితోషకం తీసుకున్నది. ముఖ్యంగా విజయశాంతి సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే అప్పట్లో స్టార్ హీరోల సినిమాలు కూడా వాయిదా పడేవి. అంతలా లేడీ అమితాబ్ బచ్చన్ గా గుర్తింపు తెచ్చుకుంది విజయశాంతి.
ఇదిలా ఉండగా విజయశాంతి .. నందమూరి హీరో బాలకృష్ణ తో ఎక్కువగా సినిమాలు చేయడం వల్ల బాలకృష్ణకు విజయశాంతికి మధ్య ఏదో సంబంధం ఉందని.. ఇద్దరు వివాహం చేసుకోబోతున్నారు అనే వార్తలు కూడా బాగా వచ్చాయి. అయితే అప్పట్లో ఈ విషయంపై అటు బాలకృష్ణ కానీ , ఇటు విజయశాంతి కానీ ఎవరు కూడా స్పందించలేదు . ఆ తర్వాత విజయశాంతి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన శ్రీనివాస్ ప్రసాద్ ను వివాహం చేసుకుంది.
ఇక ఇదే విషయాన్ని బాలకృష్ణతో చెప్పగా.. బాలకృష్ణ కి కూడా విజయశాంతి అంటే మంచి అభిప్రాయం ఉండడంతో.. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని సూచించారు అట బాలకృష్ణ. అంతేకాదు బాలకృష్ణ స్వయంగా దగ్గరుండి వీరిద్దరి వివాహం జరిపించారు అని సమాచారం. ఇక అలా బాలకృష్ణ ప్రోత్సాహంతో శ్రీనివాస్ ప్రసాద్ , విజయశాంతి ల వివాహం జరిగింది.