యాత్ర -2 సినిమా తెరకెక్కపోవడానికి కారణం అదేనా..?

-

టాలీవుడ్లో మహానటి చిత్రంతో మొదలైన బయోపిక్ ట్రెండ్ ఇప్పుడు మొత్తం అన్నిచోట్ల విస్తరిస్తుందని చెప్పవచ్చు. వాస్తవానికి మహానటి సినిమా కు ముంద రూపొందించిన బయోపిక్ ఏవి అంతగా సక్సెస్ కాలేక పోయాయి. కానీ దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా వచ్చిన యాత్ర సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2019లో వచ్చిన ఈ సినిమా సినిమా జగన్మోహన్ రెడ్డి గెలుపుకు సహకరించిందని చెప్పవచ్చు.


అలా వైయస్.. రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం 2004 ఎన్నికల ముందు వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర గురించి అతను ముఖ్యమంత్రి అవ్వడానికి ఎలా కష్టపడ్డాడు అనే అంశాన్ని మాత్రమే డైరెక్టర్ మహి. వి. రాఘవన్ తెరకెక్కించారు. ఎటువంటి కాంట్రవర్సీలకు స్కోప్ లేకుండా ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న తర్వాత యాత్ర -2 సినిమా కూడా రాబోతోందని అతను ఒకానొక సందర్భంలో తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి పనులు కూడా జరగలేదు.

యాత్ర-2 వైయస్ జగన్ 2014 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత 2019 ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అయ్యేవరకు జరిగిన అంశాలను తీసుకొని తెరకెక్కించాలని ఉద్దేశంతో మహి.వి.రాఘవ ఉద్దేశం అన్నట్లుగా సమాచారం. అయితే అందుకోసం సూర్య, కార్తీకులతో కూడా సంప్రదింపులు జరిపినట్లుగా సమాచారం.వారు బిజీగా ఉండడంతో ఆది పినిశెట్టిని కూడా సంప్రదించడం జరిగినట్లు సమాచారం.

ఇక ఈ చిత్రానికి కూడా ఆది గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కేవలం బడ్జెట్ వ్యవహారంలోనే ఈ సినిమా కాస్త ఆలస్యం అయ్యే విధంగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. యాత్ర సినిమా కంటే డబుల్ బడ్జెట్ అవుతున్నట్లుగా సమాచారం. అందుచేతనే ఈ సినిమా కాస్త ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version