గ్యాస్ బర్నర్ల మీద మురికి ఎక్కువ ఉందా..? ఇలా క్లీన్ చేసేయండి మరి..!

-

పొయ్యి మీద మనం రోజు ఏదో ఒకటి వండుకుంటూనే ఉంటాం. జిడ్డు, మురికి ఇలా ఎన్నో స్టవ్ కి అంటుకుంటు ఉంటాయి దీంతో స్టవ్ ని క్లీన్ చేయడం పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. పైగా స్టవ్ ని క్లీన్ చేయాలంటే ఎక్కువ సమయం కూడా పడుతుంది. ఈజీగా ఆ జిడ్డు అంతా కూడా వదలదు. గ్యాస్ బర్నర్స్ మీద జిడ్డు మరికలు తేలికగా వదలవు కాబట్టి ఇలా చేయండి. ఇలా చేయడం వలన ఈజీగా మరకలు పోతాయి. కొత్త వాటిలా కనిపిస్తాయి.

గ్యాస్ స్టవ్ ని క్లీన్ చేసేటప్పుడు ఇలా చేయండి ఇక ఈజీగా అంత వదిలిపోతుంది. సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు. జిడ్డు, మరకలు చూడడానికి బాగా కనిపించవు ఈ మరకలు కోసం ఎక్కువ టైం పెట్టాల్సి ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుండి కూడా స్టవ్ ని మనం చాలా సార్లు వెలిగిస్తూ ఉంటాము బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం మొదలు రాత్రి డిన్నర్ వరకు చాలా వండుతూ ఉంటాము అయితే స్టవ్ ని క్లీన్ చేసుకోవాలంటే మీరు ఈజీగా తడి పొడి గుడ్డతో క్లీన్ చేసుకోవచ్చు.

ప్రతిరోజు తడి పొడి గుడ్డతో శుభ్రం చేస్తూ ఉండండి. అలానే ఉల్లిపాయ ముక్కల్ని గుండ్రంగా కట్ చేసి ఉల్లిపాయని వేడి నీటిలో సుమారు 20 నిమిషాల పాటు ఉడకనివ్వండి తర్వాత చల్లారాక స్పాంజ్ సహాయంతో మీరు క్లీన్ చేయండి. గ్యాస్ బార్నర్ లోపల కొంచెం వెనిగర్ చుక్కలు వేయండి అలా ఉంచేసి తర్వాత స్పాంజ్ తో బర్నర్ ని క్లీన్ చేసుకోండి ఇక మురికి అంత పోతుంది. ఒక గిన్నె నీళ్ళు తీసుకొని వేడి చేసి అందులో ఉప్పు వేసి తర్వాత ఆ నీటి తో బర్నలని శుభ్రము చెయ్యాలి. ఇలా కూడా ఈజీగా మురికి అంతా వదిలిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version