హీరోయిన్ కళ్యాణి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో, అందంతో ఎంతో మందిని ఆకట్టుకున్న ఈమె స్టార్ హీరోల సినిమాలలో నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్న సమయంలోనే ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ ను 2005లో వివాహం చేసుకుంది. సూర్య కిరణ్ కేవలం దర్శకుడు మాత్రమే కాదు చైల్డ్ ఆర్టిస్ట్ గా 200 సినిమాలలో నటించి , పదుల సంఖ్యలో అవార్డులను సొంతం చేసుకున్నారు. సత్యం సినిమాతో దర్శకుడిగా మారిన ఈయన మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.
ఇకపోతే 10 సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరిద్దరూ విడాకులు తీసుకోవడం జరిగింది. ఇకపోతే ఇటీవల కళ్యాణి, సూర్య కిరణ్ విడాకులు తీసుకోవడానికి అసలు కారణం ఇదే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా.. ఆ పుకార్లపై సూర్యకిరణ్ క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల పాటు మేము కాపురం చేసాము. మా ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు లేవు. కోర్టు కి వెళ్లకుండా సపరేట్ గా జడ్జ్ నీ మీట్ అయ్యాము. ఇకపోతే జడ్జ్ కళ్యాణి తో ఇతడు మిమ్మల్ని కొడుతున్నాడా? లేక ఇబ్బంది పెడుతున్నాడా ? వాళ్ళ అమ్మానాన్న మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా ?అని అడిగారు .. కానీ ఆమె అన్నింటికీ కూడా కాదు అని సమాధానం ఇచ్చింది. మరి ఎందుకు డైవర్స్ తీసుకుంటున్నారు అని అడగగా.. అది అని కళ్యాణి చెబుతూ ఉండగా మీరు డైవర్స్ తీసుకుంటే పిల్లలు ఎవరి దగ్గర ఉంటారు అని కూడా జడ్జ్ అడిగారు.
ఇక పిల్లలు లేరని చెప్పిన కళ్యాణి .. ఇక సమస్య అదేనంటూ నేను కూడా ఒప్పుకున్నాను. ఇక విడాకులు మంజూరైన తర్వాత కళ్యాణి తో కొద్ది రోజులు ఆగండి అప్పులు తీరిపోయాక మళ్ళీ పెళ్లి చేసుకుందామని కూడా చెప్పాను అంటూ సూర్యకిరణ్ క్లారిటీ ఇచ్చారు.