షుగర్ ఉందా..? ఈ తప్పులు అస్సలు చెయ్యకండి..!

-

చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ తప్పులు అస్సలు చేయకూడదు. డయాబెటిస్ ఉన్న వాళ్లు కచ్చితంగా ఈ తప్పులు చేయకుండా చూసుకోవాలి లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

తక్కువ నీళ్లు తాగడం:

చాలామంది ఎక్కువ నీళ్లు తీసుకోరు తక్కువ నీళ్లు తాగడం వలన ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా శీతాకాలంలో నీళ్లు ఎక్కువ తాగరు. కానీ డిహైడ్రేషన్ ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎక్కువ నీళ్లు తీసుకుంటూ ఉండండి.

ఆర్టిఫిషియల్ షుగర్:

ఆర్టిఫిషియల్ షుగర్ ని తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవని అనుకుంటారు కానీ ఇది ఇన్సులిన్ హార్మోన్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి దీనికి కూడా దూరంగా ఉండాలి.

అల్పాహారం స్కిప్ చేయొద్దు:

చాలామంది బ్రేక్ఫాస్ట్ ని తినకుండా ఉంటారు అలాంటప్పుడు షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి బ్రేక్ ఫాస్ట్ ని తప్పకుండా తీసుకోండి. అల్పాహారాన్ని మానేస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాలి.

కెఫిన్ ఉండే డ్రింక్స్:

కెఫిన్ ఉండే డ్రింక్స్ ని తీసుకోవడం వలన కూడా షుగర్ లెవెల్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి కెఫిన్ ఉండేవాటికి దూరంగా ఉండాలి.

ఆల్కహాల్:

ఆల్కహాల్ వలన కూడా సమస్యలు కలుగుతాయి ఆల్కహాల్ తాగడం వలన బరువు పెరిగిపోయే అవకాశం ఉంటుంది.

అన్నం:

అన్నం ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి వీటిలో కార్బోహైడ్రేట్స్ ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అన్నానికి బదులుగా మీరు బ్రౌన్ రైస్ తీసుకుంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version