ఈ యాంకర్ సడన్ గా ఇండస్ట్రీకి దూరం కావడానిక కారణం అదేనా..?

-

బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు వస్తూనే ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి పోతూ ఉంటారు అలాంటి యాంకర్లలో ఉదయభాను కూడా ఒకరని చెప్పవచ్చు. అయితే ఈమె బుల్లితెరపై ఎక్కడా కనిపించడం లేదు ప్రస్తుతం. కానీ ఒకప్పుడు మాత్రం ఎక్కువగా చూసిన ఉదయభాను కార్యక్రమాలు, షో లు వంటివి కనిపించేవి. అన్ని రకాల కార్యక్రమాలు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఉదయభాను. అంతేకాకుండా వెండితెరకు నటిగా కూడా ఎన్నో చిత్రాలలో అలరించింది.

కానీ సడన్గా బుల్లితెరపై ఉదయభాను కెరియర్ మూగబోయింది అని చెప్పవచ్చు. అయితే అప్పట్లో ఉదయభాను స్టార్ యాంకర్ గా కొనసాగిన ఉదయభాను.. ప్రస్తుతం ప్రేక్షకులు కావాలనే ఈమెను దూరం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె కనుమరుగు కావడానికి ముఖ్య కారణం ఏమిటి అంటూ ఆమె అభిమానులు సైతం ఎక్కువగా సర్చ్ చేయడం జరిగింది. అందానికి అందం, అభినయం ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా ఉదయభాను కనిపించక పోయారు.

బుల్లితెరపై యాంకర్గా చేస్తున్న సమయంలో సినిమాలలో అవకాశాలు రాగానే ఆమె మనసు అటువైపుగా వెళ్లిందని దాంతో ఈమె కెరీర్ ఇలా అయ్యింది అన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే మరికొంతమంది మాత్రం ఈమె స్టార్ యాంకర్ గా ఎదగడం చూసి ఓర్వలేక ఆమె గురించి పలు రూమర్లు క్రియేట్ చేసి అవకాశాలు రాకుండా చేశారని సమాచారం. దీంతో అవకాశాలు రాకపోవడంతో మానసికంగా కుంగిపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న ట్లుగా ఆమె సన్నిహితులు తెలియజేస్తున్నారు. ఇక ఆ మధ్యకాలంలో ఈమె గురించి పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.. ఆ కారణంగానే బుల్లి తెరపై ఒక వెలుగు వెలగాలిసిన ఉదయభాను చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరమైంది అన్నట్లుగా తెలుస్తోంది. అందుచేతనే ఈమె ఎక్కువగా వైవాహిక జీవితానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది. తాజాగా యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version