ఈ మధ్య కాలంలో చాలామంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని దూరం పెట్టేస్తున్నారు. ఆరోగ్యానికి హాని చేసే వాటిని ఎక్కువగా తీసుకుంటున్నారు పైగా సమయం లేక పోవడం తో చాలా మంది రెడీ టు ఈట్, ప్రాసెస్డ్ ఫుడ్ వంటి వాటిని తీసుకుంటున్నారు ఇవి ఆరోగ్యానికి ప్రమాదం. పోషక విలువలు కూడిన ఆహార పదార్థాలను రెగ్యులర్ గా తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఉండవు.
మన శరీరానికి ఎన్నో పోషకాలు అవసరం. వాటిలో విటమిన్ బి12 కూడా ఒకటి. ఎర్ర రక్త కణాలని ఉత్పత్తి చేయడానికి ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని కూడా ఇది కాపాడుతుంది. శరీరంలో ఇది తగినంత స్థాయి లో లేదంటే అనేక రకాల సమస్యలు కలుగుతాయి. కానీ ఈ లోపం లేకుండా చూసుకుంటే మాత్రం సమస్యలకి దూరంగా ఉండచ్చు. అది ఆహారం తో సాధ్యం.
విటమిన్ బి12 లోపం కనుక ఉంటే శారీరమంతా కూడా ఆక్సిజన్ ప్రవహించడం లోపిస్తుంది దాంతో అలసట కూడా రావచ్చు.
జీర్ణ వ్యవస్థ పై కూడా ఇది ప్రభావం చూపుతుంది.
విటమిన్ బి12 లోపం ఉంటే నరాల వ్యవస్థ పై కూడా ప్రభావం పడుతుంది.
చర్మం పసుపు రంగులోకి మారిపోతుంది. అలానే గొంతు నాలుక ఎర్రగా మారుతుంది. నోటిపూతలు వంటివి కూడా రావచ్చు.
కళ్ళు సరిగ్గా కనపడవు.
నిరాశ, చిరాకు వంటివి ఉంటాయి.
విటమిన్ బి12 ఉంటే ఈ లక్షణాలు కూడా కనపడతాయి:
సడన్ గా బరువు తగ్గిపోవడం
గ్యాస్
ఆకలి లేకపోవడం
అతిసారం
మలబద్ధకం
ఉబ్బరం
వికారం
నడక లో మార్పు