సుధీర్ ను బుల్లితెర మెగాస్టార్ అనడానికి కారణం ఇదేనా..మరీ ఇంత డిమాండా?

-

సుడిగాలి సుధీర్.. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా బాగా పాపులారిటీని సొంతం చేసుకున్న ఈయన ఢీ , శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. అంతే కాదు స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్ గా అవకాశాలు సంపాదించుకున్న సుధీర్.. హీరోగా రెండు మూడు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా గాలోడు అనే సినిమా ద్వారా మళ్ళీ హీరోగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఇకపోతే సైడ్ ఆర్టిస్టుగా తన కెరీర్ ను మొదలుపెట్టిన సుధీర్ రేంజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రేంజ్ వరకు వెళ్ళింది అంటే ఆయన క్రేజ్ ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ముఖ్యంగా బుల్లితెరకు ఇప్పుడు మెగాస్టార్ గా చలామణి అవుతున్నారు. ఇక ఏ షోలో అయినా సరే సుడిగాలి సుదీర్ ఉంటే చాలు ఆ షో కి టిఆర్పి రేటింగ్ అమాంతం పెరిగిపోతుందని చెప్పవచ్చు. ఇక సుధీర్ కనిపిస్తే చాలు అని ఆయన అభిమానులు కూడా చెబుతూ ఉంటారు. ఇకపోతే జబర్దస్త్ షోలోకి వండర్స్ వేణు టీం ద్వారా సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత శ్రీను , రాంప్రసాద్ వంటి స్నేహితుల పరిచయం అవడంతో వీరు ముగ్గురు కలిసి చేసే స్కిట్ల ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అంతే కాదు ఈ రేంజ్ కు రావడానికి రష్మీ కూడా తన వంతు సహాయం చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య జరిగే రహస్య ప్రేమ కథ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక ఈ జంటను పదేపదే చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి కనపరుస్తూ ఉండడం గమనార్హం.

బుల్లితెరపై ఏ షోకి అయినా మంచి రెస్పాండ్ కావాలి అంటే సుదీర్ ఉంటే చాలు అని ప్రేక్షకులు అనే రేంజ్కి వచ్చాడు కాబట్టి ఆయనను అందరూ బుల్లితెర మెగాస్టార్ అని పిలుస్తూ ఉన్నారు.ఇక ఈ క్రమంలోని పారితోషకం కూడా పెంచేశారు. ఈయన పారితోషికం లక్షల రూపాయలు ఉంటుందని సమాచారం. ఇక ప్రస్తుతం మల్లెమాల టీం కూడా బాగానే ఆఫర్ చేసిందని తెలుస్తోంది .జబర్దస్త్ లోకి మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నంలో సుధీర్ కు ఏకంగా ఎనిమిది లక్షల రూపాయలు ఒక్కో షెడ్యూల్ కి ఇవ్వడానికి సిద్ధంగా ఉందట. కానీ సుదీర్ మాత్రం ఒప్పుకోకపోవడం గమనార్హం. ఇకపోతే స్టార్ మా కూడా సుధీర్ రేంజ్ ను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఒక్కో షెడ్యూల్ కోసం ఏకంగా 15 లక్షల రూపాయలు ఇస్తోందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version