చాలా మంది ప్రతి రోజ టీ కాఫీలాని తాగుతూ ఉంటారు. టీ కాఫీలు ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు. కాబట్టి లిమిట్ గానే తీసుకుంటూ ఉండాలి. అతిగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవు. చాలా మంది పనిలో ఉండి టెన్షన్ ఒత్తిడి కారణంగా టీ కాఫీలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అయితే టీ కాఫీ తాగిన తర్వాత చాలా మందికి నీళ్లు తాగే అలవాటు కూడా ఉంటుంది.
టీ కాఫీలని తీసుకున్న తరవాత నీళ్లు తాగితే ఏమవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. టీ కాఫీ ని తాగే ముందు చాలా మంది నీళ్లు తాగుతూ ఉంటారు అటువంటి వాళ్ళకి రిస్క్ తప్పదు. టీ లేదా కాఫీ ని తాగిన తర్వాత నీళ్లు తాగితే అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి అలానే టీ కాఫీ ని తీసుకున్నాక నీళ్లు తాగితే దంత సమస్యలు కూడా తప్పవు.
నీళ్లు టీ కాఫీలు తీసుకున్నాక తాగితే కడుపులో అల్సర్లు కూడా వచ్చే ఛాన్స్ ఉంది అలానే టీ కాఫీ ని తీసుకున్నాక నీళ్లు తాగితే గొంతు నొప్పి కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. టీ కాఫీ ని తాగిన ఒక అరగంట లేదంటే గంట తర్వాత నీళ్లు తాగొచ్చు కానీ వెంటనే అసలు తాగొద్దు. టీ, కాఫీ ని లిమిట్ గా తీసుకోవడం వలన ఆరోగ్యానికి మంచిదే కానీ టీ కాఫీలని ఎక్కువ తీసుకోవడం.. టీ కాఫీలు తీసుకున్నాక నీళ్లు తాగడం వంటి తప్పులు చేయొద్దు ఇటువంటి తప్పులు కనుక చేశారంటే సమస్యలు తప్పవు.