నిజ్జర్ హత్య వెనుక ఐఎస్‌ఐ హస్తం

-

ఖలిస్థానీ మద్దతుదారుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యల వల్ల భారత్‌, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే నిజ్జర్ హత్యకు సంబంధించి పలు కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే ఈ హత్య వెనుకాల పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.

గత రెండేళ్లలో కెనడాకు వచ్చిన గ్యాంగ్‌స్టర్‌లకు పూర్తిగా మద్దతు ఇవ్వమని అతనిపై ఒత్తిడి తెచ్చిందని కూడా వర్గాలు తెలిపాయి. అయితే, నిజ్జర్ మొగ్గు మాజీ ఖలిస్తానీ నాయకుల వైపే ఉంది. నిజ్జర్ హత్య తరువాత, ఐఎస్‌ఐ ఇప్పుడు కెనడాలోని ఖలిస్తాన్ అనుకూల ఉగ్రవాదులను సమీకరించడానికి సిద్ధమవుతోందని కూడా వర్గాలు నమ్ముతున్నాయి. బ్రిటీష్ కొలంబియాలో జూన్ 18న తన దేశ గడ్డపై హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల ఆరోపించిన తర్వాత దౌత్యపరమైన వివాదం చెలరేగింది. ఆ తర్వాత న్యూ ఢిల్లీ.. కెనడా వాదనను తిప్పికొడుతూ.. ఆ ఆరోపణలన్నీ అసంబద్ధం, ప్రేరేపితమైనవని తిరస్కరించింది. ఈ క్రమంలోనే కెనడియన్ పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. దేశంలో దౌత్యపరమైన ఉనికిని తగ్గించుకోవాలని ఒట్టావాను కోరింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version