వర్క్ ఫ్రమ్ హోమ్ పై పెరుగుతున్న భిన్నాభిప్రాయాలు.. ఐటీ అసోసియేషన్ ఏం చెప్పిదంటే,

-

కరోనా వచ్చినప్పటి నుండి అన్ని పనులు ఇంటి నుండే జరుగుతున్నాయి. ఆఫీసులకు తాళాలు పడడంతో ఉద్యోగస్తులందరూ ఇళ్ళనుండే ఆఫీసు పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా ఇళ్ళనుండి ఆఫీసు పనులు చేసే వాళ్ళలో ఐటీ రంగానికి చెందిన వారే ఎక్కువ. ఐతే మొదట్లో ఇంటి నుండి వర్క్ చేయడం పెద్దగా ఇబ్బంది అనిపించనప్పటికీ, రాను రాను అదొక పెద్ద సమస్యగా మారింది. అది కూడా కొంతమందిలో మాత్రమే. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా పని పెరుగుతుందని, రోజుకు 12గంటలు పనిచేయాల్సి వస్తుందని, దానివల్ల అనేక మానసిక ఒత్తిళ్ళ ఎదుర్కోవాల్సి వస్తుందని ఉద్యోగస్తులు అంటున్నారు.

అలాగే మరికొంత మంది మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ బాగానే ఉందని, ఆఫీసులకి రాలేమని, కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడు విజృంభిస్తుందో చెప్పలేమని, అందువల్ల రిస్క్ తీసుకోలేమని కార్యాలయాలకు విన్నవించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఐటీ అసోసియేషన్ వాదన మరోలా ఉంది. కరోనా కట్టడిలోనే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని, ఆఫీసులో భద్రతా ప్రమాణాలు పాటిస్తారని, దానివల్ల పెద్దగా ఇబ్బంది ఉండదని వెల్లడించింది. మొత్తానికి వర్క్ ఫ్రమ్ హోమ్ పై చాలా రోజుల తర్వాత భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version