‘కారు’పై ఐటీ-ఈడీ దాడులు..రివెంజ్ తప్పదా.!

-

ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి కేంద్ర సంస్థలు..కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీల చేతుల్లో కీలుబొమ్మలుగా ఉన్నాయనే విమర్శలు ఎప్పటినుంచో వస్తున్నాయి..ఇక వాటిని అడ్డుపెట్టుకుని కేంద్రం..ప్రత్యర్ధులపై రివెంజ్ తీర్చుకుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈడీ, సి‌బి‌ఐ దాడులు జరిగి..అరెస్ట్ అయిన వారిలో 95 శాతం మంది ప్రతిపక్ష నేతలే ఉన్నారట. దీని బట్టి చూస్తే కేంద్రానికి..ప్రతిపక్షాలే టార్గెట్ అవుతాయని అర్ధమవుతుంది.

ఇక తెలంగాణలో టి‌ఆర్‌ఎస్‌తో బీజేపీకి పెద్ద యుద్ధమే నడుస్తోంది..దీంతో అక్కడ టి‌ఆర్‌ఎస్ పార్టీని సైతం ఇరుకున పెట్టేలా కేంద్రం ముందుకెళుతుందని, ఐటీ, ఈడీ, సి‌బి‌ఐ లని ఉసిగొల్పుతుందని కే‌సి‌ఆర్ తో సహ టి‌ఆర్‌ఎస్ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఎంపీ నామా నాగేశ్వరావు లాంటి వారిని గట్టిగా టార్గెట్ చేశారు..కొన్ని ఆస్తులు ఎటాచ్ కూడా చేశారు. అలాగే మద్యం లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు వినిపించింది..ఆమెని అరెస్ట్ చేస్తారని కథనాలు వచ్చాయి.

ఇదే క్రమంలో మునుగోడు ఉపఎన్నిక వచ్చింది..ఈ ఉపఎన్నికలో బీజేపీని ఓడించి టి‌ఆర్‌ఎస్ సత్తా చాటింది. ఉపఎన్నిక ముగిశాక..ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి కే‌సి‌ఆర్..బి‌జే‌పిని గట్టిగా టార్గెట్ చేశారు. కే‌సి‌ఆర్ సైతం తన అధికార బలాన్ని వాడుతూ..బి‌జే‌పిని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో కేంద్రం సైతం కౌంటర్లు ఇవ్వడానికి రెడీ అయిందని తెలుస్తోంది.

ఇలా వార్ నడుస్తుండగానే..ఇప్పుడు మంత్రి గంగుల కమలాకర్‌కు చెందిన గ్రానైట్ సంస్థలపై ఐటీ, ఈడీ దాడులు చేసింది. కరీంనగర్ లోని గంగుల కమలాకర్ ఇంటితోపాటు, మంకమ్మతోటలోని ఆయనకు చెందిన శ్వేత గ్రానైట్ కమాన్ ప్రాంతంలోని మహవీర్ ఎస్వీఆర్ గ్రానైట్స్ లో ఐటీ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే మునుగోడులో గెలిచిన ఆనందాన్ని టి‌ఆర్‌ఎస్ పార్టీకి ఎక్కువ కాలం ఉండనివ్వకుండా, బి‌జే‌పి ఇలా ఐటీ, ఈడీ అంటూ..ప్రతీకారం తీర్చుకుంటుందని టి‌ఆర్‌ఎస్ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. మరి గంగుల తర్వాత..టార్గెట్ ఎవరో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version