హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపై ప్రస్తుతం పెద్దఎత్తున వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీబీజేపీ ఎంపీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఈ సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఆర్థికంగా దివాళా తీసిందన్నారు.భూములు అమ్మకపోతే ఒక్కరోజూ కూడా ప్రభుత్వాన్ని నడవలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.భూములను అమ్మి ప్రభుత్వాన్ని నడపాలనే సిగ్గుమాలిన పనికి రేవంత్ రెడ్డి సర్కార్ ఒడిగడుతోందని విమర్శించారు.భూముల అమ్మకం విషయంలో ప్రభుత్వం ఇలాగే ముందుకు వెళ్తే ఖబర్దార్ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈటల హెచ్చరించారు.ఓ వైపు రాష్ట్రంలో ఆసుపత్రులు, రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిద్దామంటే స్థలాలు దొరకని పరిస్థితి ఉందని.. అప్పుడు 400 ఎకరాలను ఈ ప్రభుత్వం రూ.40 వేల కోట్లకు అమ్మకానికి పెట్టిందని ధ్వజమెత్తారు.