ఇదివరకు తీసుకున్న రుణానికి సంబంధించి నెలనెలా వాయిదాలు కట్టడం లేదని బ్యాంక్ మేనేజర్ కన్నెర్ర చేశాడు.లోన్ తీసుకున్న పర్సన్ ఇంటివద్దకు వచ్చి ఏకంగా EMI కింద గొర్రెలను తీసుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో బుధవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.
బానోత్ లింగా అనే వ్యక్తి.. ఆరు నెలల క్రితం డీసీసీబీ బ్యాంక్‌లో రూ.50 వేలు లోన్ తీసుకున్నట్లు సమాచారం. ఇంట్లో పెద్దల అనారోగ్యం కారణంగా EMI చెల్లించలేకపోయాడు. దీంతో బ్యాంక్ మేనేజర్ 3 గొర్రెలను తీసుకెళ్లినట్లు తెలిసింది. రూ.10 వేలు కట్టడంతో గుట్టు చప్పుడు కాకుండా గొర్రెలను తిరిగి బాధితుడి ఇంటికి తరలించినట్లు సమాచారం.ఈ విషయం స్థానికంగా వైరల్ అవుతోంది.