రఘునందన్ రావు పై కేసులు పెట్టడం సిగ్గుచేటు: బండి సంజయ్

-

జూబ్లీహిల్స్ లో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో దోషులను శిక్షించే వరకు బీజేపీ ఉద్యమిస్తూనే ఉంటుందని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. సామూహిక అత్యాచారం ఘటన లో నేరం చేసిన వారిపై కేసులు నమోదు చేయని పోలీసులు.. న్యాయం చేయాలంటూ ఉద్యమిస్తున్న బీజేపీ నాయకులు.. కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే రఘునందన్ రావు పై కేసులు పెట్టడం సిగ్గుచేటని అన్నారు. ఈ అత్యాచార ఘటనపై ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా దోషులను అరెస్టు చేయడంలో ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన ప్రశ్నించారు.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

బీజేపీ నాయకుల, కార్యకర్తలపై కేసులు పెట్టేందుకు చూపుతున్న ఉత్సాహం దోషులను అరెస్టు చేయడం పట్ల చూపితే న్యాయం జరిగేదని ఆయన అన్నారు. టిఆర్ఎస్, మజ్లిస్ నేతల ప్రమేయం ఉన్నందునే ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. ఇది ముమ్మాటికి టిఆర్ఎస్ ప్రభుత్వ చేతగానితనమేనని.. నేరాలను అరికట్టడంలో మేమే నెంబర్ వన్ అని గొప్పలు చెప్పుకునే కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ గొంతు ఎందుకు మూగబోయింది అని బండి సంజయ్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version