కార్తీక మాసంలో వీటిని పాటిస్తే ఎంతో మంచిది..!

-

కార్తీక మాసం అంటే మనకు గుర్తొచ్చేది పూజలు, దీపారాధన, ఉపవాసాలు మొదలైనవి. అయితే ఈ సంవత్సరం కార్తీకమాసం అక్టోబర్ 21 నుండి మొదలయ్యింది. చాలామంది హిందువులు కార్తీకమాసంలో ఉపవాస దీక్షలు చేస్తారు. అదే విధంగా ప్రతి రోజూ తెల్లవారుజామున దీపారాధన చేసి దేవుడికి పూజలు అందిస్తారు.

విష్ణుమూర్తి కార్తీక మాసంలో తన నాలుగు నెలలు నిద్రను పూర్తిచేసి ఏకాదశి రోజున తిరిగి మేల్కొంటారు. దీనితో చాతుర్మాస ముగిసిపోతుంది. అప్పటి నుండి కూడా శుభ కార్యాలు చేసుకోవడానికి మంచిది. అదే విధంగా కార్తీక మాసంలో లక్ష్మీదేవి భూమిని చూడడానికి వస్తుందట. కార్తీకమాసంలో నిజంగా లక్ష్మీదేవి నారాయణుని ఆశీస్సులు పొందాలంటే తప్పక వీటిని అనుసరించాలి. ఇక మరి వాటి కోసం చూద్దాం.

కార్తీక మాసంలో ప్రతి రోజూ కూడా బ్రహ్మముహూర్తం లో స్నానం చేయడం మంచిది. పవిత్రమైన నదిలో స్నానం చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది లేదు అంటే ఇంట్లో మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకుని స్నానం చేస్తే కూడా మంచిది.

అదే విధంగా కార్తీక మాసంలో తులసి మొక్కకి పూజ చేయడం వల్ల ఎంతో మంచి కలుగుతుంది విష్ణువుతో తులసి వివాహం కూడా ఈ నెలలో జరిగింది. కార్తీకమాసం అంతటా కూడా తులసి మొక్క ఎదుట దీపం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం పొందొచ్చని పురాణాలు కూడా చెబుతున్నాయి.

అలానే కార్తీక మాసంలో ప్రతి రోజూ ఉదయాన్నే దీపం పెట్టడం వల్ల చాలా పుణ్యం పొందచ్చు. కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా దీపారాధన చేస్తే డబ్బు, ఆహారం కొరత ఉండదు. అలాగే ఈ మాసంలో దానం చేయడం కూడా చాలా మంచిది. దానాలు చేయడం వల్ల కర్మ తొలగుతుంది. పేదలకు మీ సామర్థ్యం మేరకు దానం చేస్తే చక్కటి పుణ్య ఫలాన్ని పొందవచ్చు. కాబట్టి కార్తీకమాసంలో వీటిని తప్పక అనుసరించి.. ఆయురారోగ్యాలతో ఆనందంగా వుండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version