అమ్మాయిలూ ఈ 9 లక్షణాలు ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకోకపోవటమే మంచిదట..!

-

అమ్మాయిలకు ఒక ఏజ్ నుంచే తనకు కాబోయే భర్తమీద కొన్ని అంచనాలు ఉంటాయి. చాలామంది ఒక లిస్ట్ కూడా తయరు చేసుకునే ఉంటారు. ఎలా ఉండాలో క్లారిటీ ఉంటుంది. కానీ ఎలా ఉండకూడదో కూడా మనకు తెలిసి ఉండాలి కదా..అసలు మీ లిస్ట్ లో ఈ లక్షణాలు ఉన్న అబ్బాయిని చేర్చకండి. అలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిలను పెళ్లిచేసుకోకపోవటమే మంచిదట. ఇంతకి ఆ క్వాలిటీస్ ఏంటో చూద్దాం..

1. జంతువులను హింసించే అబ్బాయిలు, అలాగే జంతువులంటే అస్సలు ప్రేమ లేని యువకుల్ని కూడా పెళ్లి చేసుకోకూడదట. ఎందుకంటే, వీరిలో చాలామంది జంతువుల్లానే భార్యలని హింసిస్తారట. అందుకే అలాంటి అబ్బాయిలని పెళ్లి చేసుకోవడం బెటర్.

2. ఎప్పుడు చూసినా ఎదో ఒక కండిషన్లు, రెస్ట్రిక్షన్లను పెట్టె అబ్బాయిలను అమ్మాయిలు అస్సలు పెళ్లి చేసుకోకోపోవటం బెటర్.. పెళ్ళికి ముందే ఇన్నీ రూల్స్ పెడితే.. పెళ్లి అయ్యాక మరింతగా ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతాయట. అది ఎంతవరకు దారి తీస్తుందో చెప్పడం ఎవరి తరమూ కాదు. అందుకే..అలా కండిషన్లు పెట్టె అబ్బాయిలను పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. ప్రతిదానికి ఏదో ఒకలొల్లి పెట్టుకుంటారట.

3. ఒకసారి మాట ఇచ్చి తప్పే యువకుల్ని కూడా పెళ్లి చేసుకోరాదట. అలాంటి వారిని నమ్మడం చాలా కష్టం. అలాంటి సంబంధాలు చాలా వరకూ నిలబడవు.

4. మీరు ఇష్టపడేసరికే వేరే యువతీతో రిలేషన్ లో ఉండి.. మీ కోసం ఆమెతో సంబంధాన్ని తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధపడే వ్యక్తులను కూడా పెళ్లి చేసుకోవడం సరికాదట. మీరు అనుకుంటారు..అరే మనకోసం ఆమెను వదులుకోని వచ్చాడు అని..కానీ రేపు వేరెవరికోసమో నిన్ను వదిలేయడనే గ్యారెంటి ఏంటి. ఎందుకంటే అలాంటివారికి సంబంధాలపై ఇష్టం లేకపోతే.. భార్యని కూడా వదిలివేయడానికి వెనుకాడరట.

5. ఏ విషయంలో అయినా నిలకడగా నిర్ణయం తీసుకోలేని వారిని పెళ్లాడకూడదట. ఎందుకంటే వీరు నిరంతరం తాము తీసుకున్న నిర్ణయం తప్పనే భావనలో ఉంటారట. ఏ విషయంలో కూడా వీరు సరైన నిర్ణయాలు తీసుకోలేరట. అయితే వారిని మీరు అర్థంచేసుకుని అండగా నిలబడితే ఓకే కామీ మనకెందుకు ఈ మెంటాలిటీ అనుకుంటే చేసుకోకపోవటమే ఉత్తమం.

6. కట్టుకోబోయే అమ్మాయి కంటే వేరేవారికి ప్రాధాన్యతను ఇచ్చేవారిని పెళ్లి చేసుకోకండి. ఎందుకంటే, వారు భార్యని అంతగా ప్రేమించరట. ఇలా చేయటానికి వేరే కారణాలు ఉండొచ్చు..కొన్నిసార్లు జరిగితే ఓకే కానీ ప్రతిసారి ఇలా చేయటం ఆలోచించాల్సిన విషయే.

7. అతిగా సారీ చెప్పేవారికి దూరంగా ఉండాలట. ఏదైనా పొరపాటు జరిగితే ఎవరైనా సారీ చెప్తారు. కానీ, అవసరానికి మించి సారీ చెప్పేవారు అతిగా స్పందించే స్వభావం కలిగిన వారు అవుతారు. వీరితో భవిష్యత్ లో ఇబ్బందులు వస్తాయట.

8. ఏ పని చేయకుండా, ఇతరులపై ఆధారపడుతున్న వారిని కూడా పెళ్లి చేసుకోకూడదట. ఎందుకంటే, వీరు పెళ్లి అయినతరువాత కూడా సంపాదించకుండా, భార్య సంపాదనపై ఆధారపడతారట. అలాగే, తల్లితండ్రుల పట్ల సఖ్యంగా మెలగని వారిని కూడా పెళ్లి చేసుకోకూడదట. ఎందుకంటే, వీరు భార్యతో కూడా సఖ్యతగా ఉండలేరు

9 . అవతలి వ్యక్తులు చెప్తున్న విషయాలను పట్టించుకోకుండా గొడవలు పడే వ్యక్తులు కూడా పెళ్లి చేసుకోవడం మంచిది కాదట. దీనివలన పెళ్లి అయ్యాక గొడవలు వచ్చి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎదుటివారితో మర్యాద లేకుండా ప్రవర్తించే వారితో కూడా సంబంధాలు పెట్టుకోకూడదట. ఎందుకంటే వీరికి భార్య పట్ల కూడా గౌరవం ఉండదు.

అయితే ఈ లక్షణాలు ఉన్న అబ్బాయిలు మీ జీవితంలో ఉంటే ఓ సారి ఆలోచించండి. ప్రతిమనిషిలోనో ఏదో ఒక లోపం అయితే ఉండే ఉంటుంది. అన్నీ సక్రమంగా ఉండటానికి మనం ఆటబొమ్మలం కాదుకదా..ఎదుటివారి లోపాన్ని అర్థంచేసుకుని ముందుకెళితే ఏ సంసారమైన బాగానే ఉంటుంది. ఈ లక్షణాలు అబ్బాయిలలోనే కాదు..అమ్మాయిలోనూ ఉన్నా అబ్బాయిలు ఆలోచించండి మరీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version