మంచినీళ్ల వల్ల మనిషికి ఎన్నోలాభాలు ఉంటాయి. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్లు అయినా వాటర్ తాగాలని చెబుతుంటారు. ఇంకా ఇది కాకుండా..తీసుకునే ఆహారంలో కూడా వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. మన శరీరంలోని అవయవాలు, కణాలు సరిగ్గా పని చేయాలంటే సరైన మోతాదులో నీరు తీసుకోవాలి. అందుకే ఎక్కువ మంది నీరు ఎక్కువగా తీసుకుంటుంటారు. బరువుతగ్గాలంటే కూడా నీళ్లు ఎక్కువగా తాగుతారు. ఇంకా నీళ్లు ఎక్కువుగా తాగటం వల్ల కూడా శరీరంలో బ్లడ్ అంతా క్లీన్ అవుతంది అంటారు. కానీ నీరు ఎక్కువగాతాగటం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందట. కాయిన్ కి రెండో సైడ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇక నీరు ఎక్కువగా తాగడం వల్ల మూత్ర విసర్జన (యూరిన్) ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఎక్కువమంది రోజుకు 6 నుంచి 8 సార్లు మూత్ర విసర్జన చేస్తుంటారు. అయితే రోజుకు 10సార్లు మూత్ర విసర్జన చేసేవాళ్లు ఎక్కువగా నీళ్లు తీసుకుంటారని అర్థం. దీని వల్ల ఎక్కువగా అలసిపోయే ప్రమాదం ఉంటుంది. నీరసంగా అనిపిస్తుంది. చేతులు, పాదాలు, పెదాల్లో వాపు ఉండటం కూడా ఎక్కువ నీరు తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాల్లో ఒకటి.
ఎక్కువగా నీళ్లు తీసుకోవడం వల్ల రక్తంలో సోడియం లెవల్స్ పడిపోయేందుకు కారణం కావొచ్చు. ఇది హైపోనాట్రిమియాకు కారణమవుతుంది. తలనొప్పి, వాంతులు, డయేరియా దీని లక్షణాలు. మన చేతులు, పాదాలు నొప్పి పెడితే అది కూడా అధిక హైడ్రేషన్‌కు కారణం అవ్వొచ్చు. కాబట్టి నీరు ఎక్కువగా తాగటం మంచిది కదా..అధికంగా తాగి లేనిపోని సమస్యలు తేచ్చుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఏదైనా పరిమితి మించితే దాని దుష్రభావాలకే దారితీస్తుంది కదా..