బఠాణి సాగు విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం..!

-

ఏ పంటకైనా సరే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అప్పుడే నష్టాలేమి రావు. ఇక బఠాణి కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నేల, ఉష్ణోగ్రత ఇలాంటివన్నీ చూసేద్దాం. ఇక వివరాలలోకి వెళితే.. ఈ పంటను శీతకాలంలో రబీ పంటగా పండిస్తారు.

 

ఈ పంట బాగా పండాలంటే ఉష్ణోగ్రత 10-17 సేం. గ్రే ఉంటే మంచిది. వేడి వాతావరణంలో పంట బాగోదు. వీటి గింజలు కూడా సరిగా రావు. కనుక శీతకాలంలోనే దీన్ని పండించాలి. సారవంతమైన నేల కానీ బాగా నీరు ఇంకె నేలలు కానీ అనుకూలంగా ఉంటాయి.

ఈ పంట కోసం విత్తు నాటాలంటే అక్టోబర్ 15, నవంబర్ 15 నేలల్లో బెస్ట్. ఇక ఎరువుల విషయానికి వస్తే.. ఎకరాకు 10 కేజీల నత్రజని 28 కేజీల పోటాష్ విత్తే సమయంలో వెయ్యాల్సి ఉంటుంది. అలానే ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువును కూడా వేస్తె పంట బాగుంటుంది. ఎంత విత్తనాలు అవసరంతాయంటే… ఎకరాకు స్వల్పకాలిక రకాలు 40-48 కేజీ మధ్య కావాల్సి వుంది.

అలానే దీర్ఘ కాలిక మొక్కలకు అయితే 32-35 కేజీల విత్తనం అవసరం. విత్తనం విత్తే ముందు నీరు పెట్టడం ముఖ్యం. దుక్కి లో ఎకరాకు ఎనిమిది టన్నుల చొప్పున బాగా మాగిన పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. కాలువలు చేయాలి. అలానే మొలకకు నేలను అనుకూలంగా మార్చాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version