కరోనా ప్రభావం తగ్గగానే అనేక దేశాల్లో లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తున్న విషయం విదితమే. మన దేశంలోనూ అనేక రాష్ట్రాల్లో కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా లాక్‌డౌన్‌లు విధించారు. కానీ కేసుల సంఖ్య భారీగా తగ్గుతుండడంతో మళ్లీ నిబంధనలను సడలిస్తున్నారు. అందులో భాగంగానే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఎప్పటిలా అన్నీ ప్రారంభమయ్యాయి. అయితే ఈ విధంగా త్వరగా లాక్‌డౌన్ నిబంధనలను సడలించడం ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అన్నారు.
కరోనా వల్ల లాక్‌డౌన్ విధించారు బాగానే ఉంది, కానీ కేసులు తగ్గుతున్నాయని చెప్పి త్వరగా నిబంధనలను సడలిస్తున్నారు, లాక్‌డౌన్‌లను ఎత్తేస్తున్నారు, ఇంత త్వరగా నిబంధనలను సడలించడం, లాక్డౌన్‌లను తీసేయడం అంత మంచిది కాదు, టీకాలను తీసుకోని వారికి ముప్పు ఎక్కువగా ఉంటుంది.. అని టెడ్రోస్ అన్నారు.
ప్రస్తుతం కొన్ని దేశాల్లో కోవిడ్ తీవ్రత ఎక్కువగా లేదు, కానీ కొన్ని దేశాల్లో కోవిడ్ తీవ్రత ఎక్కువగానే ఉంది, కొన్ని చోట్ల పెద్ద ఎత్తున టీకాలు వేస్తున్నారు, చాలా చోట్ల నిబంధనలను సడలిస్తున్నారు, కానీ ఇంత త్వరగా సడలింపులు ఇవ్వడం మంచిదిది కాదు. టీకాల ప్రక్రియ ముగిశాకే సడలించడం ఉత్తమం.. అని అన్నారు. కాగా భారత్‌లో ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గింది కానీ థర్డ్ వేవ్ నవంబర్‌లో వస్తుందని చెబుతున్నారు కనుక ఆ లోపు వీలైనంత ఎక్కువ మందికి టీకాలను వేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అందుకనే టీకాల కోసం ప్రతి రాష్ట్రం ప్రయత్నిస్తోంది.