టీడీపీలో చేరబోతున్న ఆళ్ల నానికి మరో షాక్ తగిలింది. ఏలూరులో టీడీపీ నేతల కారణంగా టీడీపీలో చేరబోతున్న ఆళ్ల నానికి తగిలింది. టిడిపిలో ఆళ్ళ నాని చేరిక మరోసారి వాయిదా పడినట్టు సమాచారం అందుతోంది.. టిడిపిలోకి ఆళ్ళ నానిని తీసుకునేందుకు నిన్న ముహూర్తం ఫిక్స్ చేశారు తెలుగు దేశం పార్టీ పెద్దలు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమయం ఇవ్వక పోవడంతో వాయిదా పడింది ఆళ్ల నాని చేరిక.
ఇక అటు ఆళ్ల నాని చేరికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏలూరుకు చెందిన టీడీపీ పార్టీ క్యాడర్.. ఆళ్ల నాని చేరికతో క్యాడర్ లో మరింత అసంతృప్తి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలోచనలో పడింది టీడీపీ పార్టీ. దీంతో ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడింది ఆళ్ళ నాని చేరిక అంశం. మరోమారు నానిని పార్టీలోకి తీసుకోవాలా వద్దా అనే విషయంపై పునరాలోచనలో అధిష్టానం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇప్పటికే వైసీపీ పార్టీకి ఆళ్ల నాని రాజీనామా చేశారు.