కులగణన సర్వేలో వివరాలు ఇవ్వని వారు నేటితో ముగియనున్న రీ సర్వేలో పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.రాష్ట్ర జనాభా లెక్కల్లో మీ భాగస్వామ్యం ఉండాలంటే కుల గణన సర్వేలో తప్పక పార్టిసేట్ కావాలన్నారు. కులగణన సర్వే నేటితో ముగుస్తుందని చెప్పారు. ఎన్యుమారెటర్లకు వివరాలు ఇవ్వని వారు వెంటనే సర్వేలో పాల్గొనాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కుల సర్వేలో పాల్గొనని వారిని అక్కడి కుల సంఘాల నేతలు, బీసీ సంఘాల నేతలు, మేధావులు ఫ్రొఫెసర్లు వారికి అవగాహన కల్పించాలని మంత్రి కోరారు. వారంతా కుల సర్వేలో పాల్గొనేలా చేయాల్సిన బాధ్యత మీదేనని స్పష్టంచేశారు. ఈ నెల 16 నుంచి 28 వరకు రీసర్వేకు అవకాశం ఇచ్చామని నేటితో గడువు ముగుస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.రీసర్వే కోసం టోల్ ఫ్రీ నం 040-211 11111కు కాల్ చేయాలని కోరారు.