ఈ యాప్ సర్వరోగ నివారిణా.. బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లొద్దు : వీసీ సజ్జన్నార్

-

బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన్నార్ సూచించారు. తాజాగా మరో వీడియోను ఆయన ఎక్స్‌లో పోస్టుచేసి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ‘అరచేతిలో వైకుంఠం చూపించడం కాదు ఇది.. అంతకుమించి. డబ్బు సంపాదన కోసం ఒళ్ళు వంచాల్సిన పని లేదంట. చెమట చిందించాల్సిన అవసరం అంతకంటే లేదంట. సర్వరోగాలకు ఒక్కటే మందులాగా ఈయన చెప్పిన యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుందట. ఆ యాప్ లో ఆటలాడి ఇలా ఐ ఫోన్, కారు, బంగారు ఆభరణాలను దర్జాగా కొనుకోవచ్చు అంట. ఇంత కన్నా మోసపూరిత మాయమాటలు ఏమన్నా ఉంటాయా… చెప్పండి.

ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు.. ఇంతగనం పైసలు వచ్చే ముచ్చట మనకే ఎందుకు చెప్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఈ పుణ్యాత్ముడు చెప్పినట్లు లక్షల్లో డబ్బు వస్తే.. ఎంతో మంది బెట్టింగ్ భూతానికి బానిసలై, ఆర్థికంగా చితికిపోయి బలవన్మరణాలకు ఎందుకు పాల్పడుతున్నారు మరి. బెట్టింగ్ గురించి చెప్పే ఇన్ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మకండి. బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోకండి’ అని రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version