గత కొన్ని రోజులుగా పెగాసస్ స్పైవేర్ గురించిన వార్తలు భారత ప్రభుత్వాన్ని చికాకుకి గురి చేస్తున్నాయనే చెప్పాలి. ఇజ్రాయెల్ రూపొందించిన ఈ స్పైవేర్ సాఫ్ట్ వేర్ ద్వారా భారతదేశంలోని రాజకీయ, జర్నలిస్టుల ఇంకా ఇతర సెలెబ్రిటీల ఫోన్లు హ్యాక్ అవుతున్నాయని వైర్ సంస్థ ప్రచురించింది. పెగాసస్ స్పైవేర్ కారణంగా కేంద్రమంత్రుల ఫోన్లు కూడా హ్యాక్ అయ్యాయని వైర్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా పెగాసస్ సాఫ్ట్ వేర్ ని వినియోగించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ విషయమై పార్లమెంటులో ఈరోజు చర్చ జరగనుంది. ఐటీ మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్, పెగాసస్ సాఫ్ట్ వేర్ పై ప్రసంగించనున్నారు. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుగా పరిగణింపబడుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. అదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే గుర్తు చేసింది. మరి పెగాసస్ పై కేంద్రమంత్రి ఏం మాట్లాడనున్నారో చూడాలి.