వాహనదారులకు గుడ్ న్యూస్.. టోల్ చార్జీలు సగానికి తగ్గనున్నాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ఫీజు నిబంధనలలో చేసిన మార్పుల వల్ల త్వరలోనే టోల్ ఛార్జీలు తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 2008లో టోల్ ప్లాజాలకు సంబంధించి నిర్ణయించిన యూజర్ చార్జీలను తాజాగా సవరించింది.

కొత్త నిబంధనల ప్రకారం సొరంగాలు, బ్రిడ్జిలు ఉన్న జాతీయ రహదారులలో టోల్ ఫీజు లెక్కింపు పద్ధతి పూర్తిగా మారబోతోంది. ఈ క్రమంలో టోల్ చార్జీలు దాదాపు సగం వరకు తగ్గే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. టోల్ ఛార్జీలు కొంత మెరకు తగ్గడం వల్ల వాహనదారులకు చాలా మేలు జరుగుతోంది. దీంతో వాహనా దారులు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు చాలా ఎక్కువగా డబ్బులు వసూలు చేశారని ఈ విషయం పైన ఆలోచన చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.