ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేసిన దోమ..30 రకాల ఆపరేషన్లు చేసినా లాభం లేదాయే..!!

-

మీ అందరికి ఈగ మూవి గుర్తు ఉండే ఉంటుంది. ఆ సినిమాలో ఈగ వల్ల విలన్‌ చాలా ఇబ్బంది పడతాడు.. కళ్లు మూసినా తెరిసినా ఈగే అతనికి కనిపిస్తుంది.. అయితే సేమ్ అలాగే.. ఓ వ్యక్తి దోమ వల్ల ఇబ్బంది పడుతున్నాడు. ఇబ్బంది కాదు..జీవితాన్నే నాశనం చేసుకున్నాడట.. దోమ వల్ల జీవితం నాశనం అవడం ఏంటా అనుకుంటున్నారా..।పాపం కోమాలోకి వెళ్లాడా వ్యక్తి.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
జర్మనీకి చెందిన 27 ఏళ్ల సెబాస్టియన్ రోట్‌ష్కేకి ఆసియా టైగర్ జాతికి చెందిన దోమ కరిచింది. ఆ దోమ కాటుతో సెబాస్టియన్ జీవితమే ఛిన్నాభిన్నమైంది. గత ఏడాదే అతడు దోమ కాటుకు గురయ్యాడు. ఆసియా టైగర్ దోమ కాటు వల్ల బాధితుడి రక్తంలో విష పూరితమైంది. దోమ కాటు వల్ల సెబాస్టియన్‌కు ఇన్‌ఫెక్షన్ సోకి, క్రమంగా కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులకు వ్యాపించి.. అవి పనిచేయడం మానేశాయి. చివరకు ఎడమ తొడపై చర్మ మార్పిడి చేయించుకోవాల్సి వచ్చింది. కాలి వేళ్లను కూడా కత్తిరించారట..
ఆసియా టైగర్ దోమ సెబాస్టియన్ ఎడమ తొడపై కుట్టింది. దోమ కాటు ద్వారా సెరాటియా అనే బ్యాక్టరీయా శరీరంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత అతడిలో ఫ్లూ వంటి లక్షణాలు కూడా కనిపించాయట.. మొదట లైట్ తీసుకున్నాడు. కానీ పరిస్థితి రోజు రోజూకు దిగజారింది. అనారోగ్యం భారిన పడ్డాడు. తొడ భాగం మొత్తం పాడవడంతో.. అతడు మంచానికే పరిమితమయ్యాడు. సరిగా తినలేకపోయాడు. మంచం మీది నుంచి లేవలేకపోయాడు. అంతలా సెబాస్టియన్ ఆరోగ్యం క్షీణించింది.
చివరకు ఓ రోజు అచేతనంగా పడి ఉండడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత నాలుగు వారాల పాటు కోమాలో ఉన్నాడు. డాక్టర్లు ఐసీయూలో ఉంచారు. ఆ దోమ కాటు వల్ల తొడపై చర్మ మార్పిడి ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత మరో 30 రకాల ఆపరేషన్లు కూడా జరిగాయట.. రెండు కాలి వేళ్లను పూర్తిగా తొలగించారు.
ప్రస్తుతం సెబాస్టియన్ ఆరోగ్యం నిలకడగా ఉంది. క్రమంగా కోలుకుంటున్నాడు. కానీ అతడి ఆరోగ్యం మునపటిలా ఉండదు. అంత యాక్టివ్‌గా జీవించలేడు. ప్రతి వారానికి ఓసారి వైద్య చికిత్స అవసరం. డాక్టర్లు లేనిదే అతడు జీవించలేకపోతున్నాడట… మొత్తంగా ఆ దోమ కాటు వల్ల సెబాస్టియన్ జీవితమే సర్వ నాశనం అయింది. మోరల్‌ ఆఫ్‌ ది స్టోరీ ఏంటంటే.. ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ వస్తే..లైట్‌ తీసుకోకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి..లేదంటే చాలా నష్టపోవాల్సి వస్తుందనమాట.!

Read more RELATED
Recommended to you

Exit mobile version