అది ఎప్పటికీ ప్రత్యేకమే.. జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న పూజా హెగ్డే..!

-

అందం, అభినయం కలగలిపిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో పూజా హెగ్డే కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తెలుగులో ఉన్న దాదాపు అందరూ హీరోల సరసన నటించి మెప్పించింది ముఖ్యంగా పూజా హెగ్డే కెరియర్ లో ది బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది అలా వైకుంఠపురంలో.. ఈ సినిమా ద్వారానే ఈమెకు బుట్ట బొమ్మ అనే పేరు కూడా లభించింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ సినిమాతో పూజా హెగ్డే కి కూడా మంచి గుర్తింపు లభించింది.

ఈ సినిమాలోని బుట్ట బొమ్మ పాట పూజాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ సాంగులో సిగ్నేచర్ స్టెప్ నెట్టింట బాగా వైరల్ అయింది. అప్పటినుంచి పూజా ను ప్రతి ఒక్కరు బుట్ట బొమ్మ అని పిలవడం మొదలుపెట్టారు. అమూల్య పాత్రలో నటించి సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ సినిమా తాలూకు జ్ఞాపకాలను పంచుకుంది. అలవైకుంఠపురంలో చిత్రం విడుదలై మూడేళ్లు గడుస్తుంది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

“అమూల్య క్యారెక్టర్ మూడేళ్ల క్రితం పుట్టింది ఈ సినిమా నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. మూడేళ్ల వేడుకలు జరుపుకోవాలని అలవైకుంఠపురంలో సిద్ధంగా ఉంది” అంటూ బుట్ట బొమ్మ పాటను పోస్ట్ చేసింది. మొత్తానికైతే ఈమె చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. పలువురు అభిమానులు ఈమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version