ఐటెల్ నుంచి కొత్త ఫోన్ విడుదలైంది. itel Vision 3 Turbo స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. దీని ధర కూడా చాలా తక్కువ. ఇందులో అదరిపోయే బ్యాటరీ ఫీచర్ ఉంది. ఇంకా ఫోన్ వివరాలు ఇలా ఉన్నాయి..
దీని బ్యాటరీ 20 నిమిషాల ఛార్జ్ తోనే 3 గంటల టాక్ టైమ్ అందించగలదు. ఈ ఫోన్ ధర కూడా చాలా తక్కువ. itel Vision 3 Turboలో 6GB RAM (వర్చువల్ ర్యామ్) అందించారు. HD+ రిజల్యూషన్ కలిగిన 2.5D కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే మెరుగైన బ్యాటరీ వంటివి ప్రధాన అంశాలుగా ఉన్నాయి. దీని బ్యాటరీ రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులోని ఇంటెలిజెంట్ పవర్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీతో బ్యాటరీ బ్యాకప్‌ను 20 శాతం మేర పెంచవచ్చు. ఈ రేంజ్ ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్ సాధారణంగా రూ. 20-30 వేల బడ్జెట్ లో ఉంటుంది. కానీ itel Vision 3 Turbo మాత్రం మీకు రూ. 10 వేల లోపు ధరతోనే లభించడం విశేషం..అదనంగా కంపెనీ వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్ కూడా అందిస్తుంది. ఫోన్ కొనుగోలు చేసిన 100 రోజుల వరకు స్క్రీన్ పగిలిపోతే, ఉచితంగా కొత్త స్క్రీన్ అమర్చుతామని పేర్కొంది.
itel Vision 3 Turbo స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
6.6 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే అందిచారు.
3GB+3GB Turbo RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో నడుస్తుంది.
యూనిసాక్ SC9863A ఆక్టా కోర్ ప్రాసెసర్ అందించారు.
వెనకవైపు 8MP+AI డ్యుఎల్ కెమెరా, ముందు భాగంలో 5MP సెల్ఫీ షూటర్‌లో లభిస్తుంది.
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
5000mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
ధర రూ. 7,699/-గా నిర్ణయించారు.
ఈ ఫోన్ మల్టీ గ్రీన్, జ్యువెల్ బ్లూ, డీప్ ఓషన్ బ్లూ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి దీనిని కొనుగోలు చేయవచ్చు.