అల్లరి నరేష్ “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” ట్రైలర్ కు ముహుర్తం ఫిక్స్

-

నాంది తర్వాత అల్లరి నరేష్ నుంచి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. నాంది సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాదు నటుడిగా నరేష్ కు చాలా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో అల్లరి నరేష్ సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే సినిమా నుండి ఫస్ట్ లుక్ ను అలాగే టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్‌ ను వదిలింది చిత్ర బృందం. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ట్రైలర్‌ ను రేపు రిలీజ్‌ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే…మొదట నవంబర్ 11వ తేదీన ఈ సినిమాని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తాజాగా తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ప్రకటించారు. నవంబర్ 25వ తేదీన ఈ సినిమాని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version