సుధీర్ టీం పై షాకింగ్ కామెంట్స్ చేసిన జబర్దస్త్ శ్యాంప్రసాద్ రెడ్డి..!!

-

జబర్దస్త్.. ఈటీవీలో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ కామెడీ షో గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ షో గురించి వింటే కచ్చితంగా సుధీర్, శ్రీను, రాంప్రసాద్ వంటి వాళ్ళ పేర్లు ప్రముఖంగా వినిపించేవి. అంతేకాదు వీరు చేసే స్కిట్ల కోసమే చాలామంది ఈ షో కూడా చూసేవాళ్ళు. ముఖ్యంగా వీళ్ళ స్నేహానికి చాలామంది ముచ్చటపడేవారు. కానీ తర్వాతి కాలంలో కొన్ని కారణాలవల్ల సుధీర్ , గెటప్ శ్రీను ఇద్దరూ కూడా జబర్దస్త్ షో ని వీడిపోవడం జరిగింది. ఇక తన మిత్రులు లేని లోటును గుర్తు చేసుకుంటూ రాంప్రసాద్ ఎప్పటికప్పుడు బాధపడుతూనే ఉన్నాడు. కానీ వారిద్దరూ కూడా జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడానికి కారణం జబర్దస్త్ యాజమాన్యంతో ఉన్న గొడవలు అని పలువురు వార్తలు సృష్టిస్తున్నారు. ఇక జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన కిరాక్ ఆర్పి కూడా వాళ్ళిద్దరూ ఎందుకు షో నుంచి వెళ్లిపోయారో చెబుతూనే యాజమాన్యంపై ఆరోపణలు కూడా చేశాడు.

ఇకపోతే తాజాగా జబర్దస్త్ షో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్ లపై చేసిన కామెంట్లకు సంబంధించి ఒక వీడియో బాగా వైరల్ గా మారుతుంది. ఆయన మాట్లాడుతూ వీళ్ళు ముగ్గురు కాదు.. ముగ్గురు కలిసి ఒక మనిషి. వీళ్లు ముగ్గురు కలిసి ఒకటైతేనే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు. ఇక నా బోర్డంకి వీళ్ళు ముగ్గురు మంచి మెడిసిన్ లాంటివాళ్ళు. ముఖ్యంగా నా ఐపాడ్ లో వీరి ముగ్గురికి సంబంధించిన స్కిట్లు 100కి పైగా ఉంటాయి. బోర్ కొట్టినప్పుడల్లా నేను వీళ్ళ స్కిట్లను మాత్రమే చూస్తాను. నాకు మళ్ళీ ఎనర్జీ వస్తుంది. వాళ్లు నాకు అత్యంత సన్నిహితులు అని తెలిపారు. ఇకపోతే ఇందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి విడుదల చేయడం జరిగింది.అది కాస్త నెట్టింట బాగా వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version