Jabardast: సుధీర్ రీ ఎంట్రీ కి అడ్డుపడుతోంది ఎవరు..?

-

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని ఆ తర్వాత బుల్లితెర మీద స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సినిమాలలో అవకాశాలు రావడంతో జబర్దస్త్ వదిలేసిన ఈయనపై పలు రకాల విమర్శలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయాలపై స్పందించిన సుధీర్ తనకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని అందుకే మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడి జబర్దస్త్ కి కొద్దిరోజులు విరామం ఇచ్చి సినిమాలలో నటించానని ఇప్పుడు ఆర్థిక పరిస్థితులన్నీ తీరిపోయాయి అని..మళ్ళీ త్వరలోనే జబర్దస్త్ లోకి వస్తానని ఇప్పటికే మల్లెమాల టీం తో కూడా చర్చించానని కూడా వెల్లడించారు.

ఈ విషయం తెలిసి అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేశారు . జబర్దస్త్ వేదికపై సుడిగాలి సుదీర్ ను మళ్ళీ చూడబోతున్నాము అంటూ ఆనందం కూడా వ్యక్తం చేశారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సుధీర్ జబర్దస్త్ ఎంట్రీ ఎప్పుడు అని ఆయన అభిమానులు ఎదురు చూస్తుండగా ఇప్పుడు మల్లెమాల సైడ్ నుంచి మాత్రం ఎలాంటి గ్రీన్ సిగ్నల్ అందడం లేదని అందుకే సుధీర్ దూరంగా ఉన్నట్లు బుల్లితెర వర్గాలు చెబుతున్నాయి.అసలు విషయంలోకి వెళ్తే మల్లెమాల తమ కాంట్రాక్టు బ్రేక్ చేసి వెళ్లిన వారి పట్ల చాలా కఠినంగా ఉంటుందని.. గతంలో జబర్దస్త్ వదిలి వెళ్ళిన చలాకి చంటి, ధనరాజ్, వేణు, చమ్మక్ చంద్ర లాంటి వారు రీఎంట్రీ ఇవ్వాలని ఎంత ప్రయత్నించినా వీరికి అవకాశం లభించలేదు అని కూడా టాక్ బయట నడుస్తోంది.

అయితే కొంతమంది సుధీర్ త్వరలోనే జబర్దస్త్ లో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా.. మరి కొంతమంది మాత్రం మల్లెమాల సుధీర్ విషయంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోదు అంటూ పెదవి విరుస్తున్నారు.. ఏదిఏమైనా సుధీర్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version